ప్రస్తుత రోజుల్లో ఆ వైరస్, ఈ వైరస్ అని అనుకుంటూ ఎప్పుడు దాని గుపెట్లో బలి అయిపోతామో తెలియని రోజుల్లో ఇప్పుడు మనం జీవిస్తున్నాం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మన మీద ఆధారపడి ఉన్న వారిని రోడ్డుపాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. కాబట్టి మనం జీవిత భద్రత కోసం lic వారు అందిస్తున్న పథకాలతో వారి జీవితానికి కొంత భరోసాగా ఉండవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే lic నుంచి ప్రస్తుతం మరో రెండు ప్లాన్స్ ని విడుదల చేసింది. దీని పూర్తి వివరాలు మీకోసం. 

 

 

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు కొత్త పాలసీలను ప్రకటించింది. ఇక ఆ పాలసీల పూర్తి వివరాలకు వస్తే ఒకటి lic సిప్ ప్లాన్, మరొకటి lic నివేశ్ ప్లస్ ప్లాన్. ఇది ULIP ప్లాన్ మాత్రమే. lic నివేశ్ ప్లస్ ప్లాన్‌ లో ప్రీమియం మొత్తాన్ని ఒకసారి చెల్లిస్తే చాలు. దీనికి మనకు రిస్క్ కవరేజీ ఉంటుంది. ఇలా మీరు చెల్లించిన ప్రీమియం మొత్తం డబ్బులు యూనిట్స్‌ లోకి చేర్చబడుతుంది. దీని అర్థం మీ డబ్బులని మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది.

 

 

 

అయితే ఈ సదుపాయం మీరు ఎంచుకున్న గడువులో మనకి ఈ రిస్క్ కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా ఈ పాలసీని ఆన్‌ లైన్‌ తో పాటు ఆఫ్‌ లైన్‌ లో కూడా వీటిని పొందవచ్చు. ఈ పాలసీలో కనీస ప్రీమియం మాత్రం ఒక లక్ష రూపాయలు. ఇక గరిష్టంగా అంటూ ఎలాంటి పరిమితి లేదు. అలాగే ఫండ్ ఆప్షన్స్ ని కూడా మీరే ఇందులో ఎంచుకోవచ్చు. ఇందులో బాండ్, సెక్యూర్డ్, బ్యాలెన్స్డ్, గ్రోత్ ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇలా నాలుగు ఫండ్స్‌ లో ఒక ఫండ్ నుంచి మరోక ఫండ్‌కు ఎప్పుడైనా మనం మారొచ్చు.  

 

 

 

ఈ పాలసీకి గాను మీ ప్రీమియంకు మొత్తానికి 1.25 రెట్లు లైఫ్ కవరేజీ అందుతుంది. ఈ పాలసీలో 5 సంవత్సరాల తర్వాత కొద్దీ మొత్తాన్ని డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పాలసీకి గాను 6, 10, 15, 20, 25 సంవత్సరాలలో గ్యారెంటీ అడిషన్స్ కూడా లభిస్తాయి. అయితే చివరగా పాలసీ మెచ్యూరిటీ సమయానికి యూనిట్ ఫండ్ వ్యాల్యూ ఎంత ఉంటే అంత మాత్రమే లభిస్తుంది.  ఈ పాలసీలో చేరుటకు కనీస వయస్సు 90 రోజులు, అలాగే గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు. ఈ పాలసీ మెచ్యూరిటీ వయస్సు కనీసం 18 సంవత్సరాలుగా అలాగే గరిష్టంగా 50 సంవత్సరాలు. ఈ పాలసీ గడువు 10 - 25 సంవత్సరాలు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ పాలసీలను త్వరగా తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: