కరోనా వైరస్ దెబ్బకు ఇటలీ మొత్తం కుప్ప కూలిపోయింది. వైరస్ ను నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఇపుడు వేలాది మంది చనిపోతున్నారు. సరే వైరస్ కాకపోతే మరో ఉపధ్రవం వస్తుంది చనిపోక తప్పదు కదా అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇటలీలో మాత్రం అలా అనుకునేందుకు లేకుండా పోతోంది. ఎందుకంటే చనిపోయిన వారిని క్రిమేషన్ చేసేందుకు కూడా అవకాశం లేదు. దాంతో మృతదేహాలు కూడా ఇళ్ళల్లో పెరిగిపోతున్నాయి. దాంతో ఇళ్ళల్లోని జనాలు గగ్గోలు పెట్టేస్తున్నారు ఇటలీలో.

 

ఇంతకీ విషయం ఏమిటంటే వైరస్ కారణంగా చనిపోయిన వారి దహన సంస్కారాల కోసం ఇటలీ ప్రభుత్వం చాలా అవస్తలు పడుతోంది. రోజుకు కొన్ని వేలమంది చనిపోతుంటే ప్రభుత్వం మాత్రం ఏమి చేస్తుంది చెప్పండి. అప్పటికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రమాణాల ప్రకారం శవాలను పూడ్చి పెట్టకూడదు. అలాగని బహిరంగంగా దహనమూ చేయకూడదు. అందుకనే ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలను వాడుతోంది.

 

అయితే ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలు ఎప్పుడో కానీ వాడే అవసరం ఉండదు. కాబట్టి అవసరానికి సరిపడా ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలు కూడా సరిపడా అందుబాటులో లేవు. అందుకనే శవాల దహనాలకు కూడా అక్కడి ప్రభుత్వం టెకోన్ నెంబర్లు కేటాయిస్తోందిట. మామూలుగా డాక్టర్ల దగ్గరకు వెళిన్నపుడు టోకెన్లు తీసుకోవటం మనకందరికీ తెలిసిందే. కానీ శవాల దహనానికి కూడా టోకెన్లు ఇవ్వటం ఏమిటో అక్కడి వాళ్ళకు ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఇవేమో మామూలుగా దహనం చేసే శవాలు కావు కదా. అందుకనే మృతదేహాలను ఎటక్ట్రిక్ క్రిమోటోరియం చేసేటపుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఒకసారి నిర్లక్ష్యం చేసిన ఫలితాన్ని ఇపుడు అనుభవిస్తున్న ఇటలీ ప్రభుత్వం శవాలను దహనం చేసే విషయంలో పాటిస్తోంది. ప్రతి శవాన్ని ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో దహనం చేయటానికి చాలా సమయం పడుతోందట. అందుకనే శవాల దహనానికి కూడా టోకెన్లు కేటాయిస్తుండటంతో కుటుంబసభ్యులు, బంధులు గగ్గోలు పెట్టేస్తున్నారు. టోకెన్ ప్రకారం శవదహనానికి తమ వంతు వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుందో తెలీక ఇటలీ జనాలు ఒకటే గోల పెట్టేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: