దేశవ్యాప్తంగా 2019 ఎన్నికల టైంలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన నాయకులలో ముందు వరుసలో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2014 ఎన్నికలలో మోడీ తో చేతులు కలిపి రాజకీయాలు చేసినా చంద్రబాబు..రాష్ట్రంలో మోడీ పై వ్యతిరేకత రావడంతో వెంటనే కాంగ్రెస్ తో చేతులు కలిపి ఎన్నికల లో పాల్గొనడం జరిగింది. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికలలో ఘోరంగా చంద్రబాబు ఓడిపోయారు. మరో పక్క మోడీ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. దీంతో భయంకరంగా మోడీని విమర్శించిన చంద్రబాబు గత పది నెలలుగా ఆయన పేరు ఎత్తడానికి కూడా సాహసించలేదు. ఇటువంటి టైములో ప్రస్తుతం జగన్ పరిపాలన లో దూసుకుపోతున్న క్రమంలో అటు జాతీయ స్థాయిలో కూడా జగన్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో...తాజాగా చంద్రబాబు చాణిక్య రాజకీయ ఎత్తుగడ కి రెడీ అయ్యారు.

 

అదేమిటంటే బీజేపీకి దగ్గరవడానికి ప్రస్తుతం చంద్రబాబు అన్ని దారులు వెతుకుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. జగన్ కి వెనకనుంచి ఎర్త్ పెట్టడానికి చంద్రబాబు త్వరలో ఏ నిమిషమైనా ఢిల్లీ పర్యటన చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిజెపిలో కొంతమంది పెద్దలు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండటంతో వాళ్ల ద్వారా అమిత్ షా కి మరియు మోడీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల దేశమంతటా డేంజర్ బెల్స్ మోగుతున్న నేపథ్యంలో ఈ గొడవంతా సద్దుమణిగిన తరువాత చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు పై అదేవిధంగా జగన్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలపై బిజెపి పెద్దలతో చర్చించడానికి రెడీ అవుతున్నట్లు, కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధమైనట్లు తెలుగు దేశం పార్టీ లో టాక్ నడుస్తుంది. ముఖ్యంగా మూడు రాజధానులు అదేవిధంగా శాసన మండలి రద్దు విషయంలో వైసిపి నాయకులు రాష్ట్రంలో కేంద్రంపై చేసిన కామెంట్లను...బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: