తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 36కు చేరింది. సీఎం కేసిఆర్ మూడు రోజుల క్రితం లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలు నిబంధనలను ఉల్లంఘించటంతో సీఎం కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని రక్షించుకునే క్రమంలో ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని ప్రకటన చేశారు. 
 
ప్రజలు మాట వింటే ఏ సమస్య లేదని లేదంటే మాత్రం 24 గంటల కర్ఫ్యూ తప్పదని పేర్కొన్నారు. ప్రజలు మాట వినకపోతే ఆర్మీని రంగంలోకి దించుతానని చెప్పారు. ప్రజలు మాట వింటారని ఆశిస్తున్నానని... వినకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని ప్రకటన చేశారు. మాట వినకపోతే కాల్చి చంపేస్తామని కీలక హెచ్చరికలు జారీ చేశారు. 
 
మన దేశం ప్రజాస్వామ్య దేశమని అందువల్ల సున్నితంగా వ్యవహరిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సమాజానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తిస్తే వారికి సంబంధించిన అన్ని లైసెన్స్ లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ఎస్పీలు, కలెక్టర్లు , కమిషనర్లతో జరిపిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని సీఎం సూచించారు. 
 
రాష్టానికి విదేశాల నుంచి వచ్చినవారి పాస్ పోర్టులను కలెక్టరేట్ లో ఉంచాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు గుంపులుగుంపులుగా రోడ్లపైకి వస్తూ ఉండటంతో ప్రజలు మాట వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల తరువాతైనా ప్రజల్లో మార్పు వస్తుందేమో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం సీఎంతో పాటు ప్రజల్ని, అధికారులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. కొంతమంది ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నా మరికొంతమంది ఈ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహించడంతో కేసీఆర్ షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: