తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్... ప్రజాప్రతినిధులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పోలీసులు ఇతర అధికారులు అందరూ పని చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉన్నారని కెసిఆర్ నిలదీశారు. హైదరాబాద్ లో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారని వాళ్ళు ఎం చేస్తున్నారని కెసిఆర్ నిలదీశారు. ప్రజలకు మనం ఆస్తి అని ఇలాంటి సమయంలో బయటకు వచ్చామా లేదా అని ప్రజలు కచ్చితంగా చూస్తారని కాబట్టి ఇప్పుడు బయటకు రావాలని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అందరికి కెసిఆర్ సూచించారు. ఎవరు బయటకు రాకపోయినా సరే చర్యలు ఉంటాయని కెసిఆర్ అన్నారు. 

 

అందరూ వచ్చి చౌరస్తాలో నిలబడాలని ఆయన సూచించారు. మంత్రులు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పని చెయ్యాలని ప్రతీ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తో పాటుగా ప్రజాప్రతినిధులు అందరూ ఉండాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేసారు. నిన్నటి వరకు పోలీసులు చాలా సున్నితంగా చెప్పారని ఇప్పుడు మాత్రం కఠినం గా ఉంటారని మాట వినకపోతే మాత్రం కాల్చి వేసే వరకు పరిస్థితులు వస్తాయని కెసిఆర్ సూచించారు. అందరూ కూడా పోలీసులకు సహకరించాలని, ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండి పరిస్థితి సమీక్షించాలని ఆయన ఆదేశించారు. ఎవరూ నియోజకవర్గం నుంచి బయటకు రావొద్దని అన్నారు. 

 

దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉందని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏ ఒక్కటి కూడా వచ్చే పరిస్థితి లేదని కాబట్టి మన దేశంలో ఉన్న రోగాన్ని మనం తగ్గించుకోవాలని ఆయన కోరారు. ప్రజలు ఎవరూ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని కెసిఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. మీడియా కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వాళ్ళను ఇబ్బంది పెడితే ప్రజలకు వార్తలు వెళ్ళే అవకాశం ఉండదని కాబట్టి మీడియా విషయంలో పోలీసులు అనవసరంగా హడావుడి చేయవద్దని కెసిఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: