ఈ అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అని... ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేసారు. మనం ముందు ఉన్న ఏకైక మార్గం ఇంటి నుంచి బయటకు రాకపోవడం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం అని మోడీ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రతీ నగరం ప్రతి ఊరు ప్రతీ వీధి లాక్ డౌన్ అన్నారు. ఈ 21 రోజులు మన ఇంట్లో మనం ఉండకపోతే పరిస్థితి మన చేతుల్లో ఏమీ ఉండదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. 

 

ఏ పరిస్థితి అయినా సరే ఇంటి నుంచి బయటకు రావొద్దని మోడీ హెచ్చరించారు. లాక్ డౌన్ నిర్ణయం ప్రతీ ఇంటికి లక్ష్మణ రేఖ అని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. కరోనా వ్యాప్తిని మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నామని కాబట్టి దీన్ని కట్టడి చెయ్యాలని మోడీ కోరారు. ఈ 21 రోజులు ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని మోడీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది అన్నారు.  ఇది కర్ఫ్యూ తరహా వాతావరణమని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఒకే పని చెయ్యాలి ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని ఆయన కోరారు. 

 

బయటకు వెళ్ళడం అనేది ఈ 21 రోజులు మరచిపోవాలని మోడీ ఈ సందర్భంగా కోరారు. కరోనాను కట్టడి చెయ్యాలి అంటే ఈ సోషల్ డిస్టెన్స్ పాటించాలని మోడీ విజ్ఞప్తి చేసారు. ఒక్క వ్యక్తి ద్వారా వేల మందికి కరోనా వైరస్ సోకుతుందని మోడీ అన్నారు. ఇది ఒకరకంగా చెప్పాలి అంటే జనతా కర్ఫ్యూ కంటే మించి అంటూ వ్యాఖ్యానించారు. ఈ 21 రోజులు చాలా కీలకమని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: