ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఒక్క మాటే వినిపిస్తుంది. ఒకే ఒక్క దాని గురించే చర్చ జరుగుతోంది. అదే కరోనా... కోవిడ్-19 .. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలు సైతం ఈ కర్ఫ్యూను ఎంతో కట్టు దిట్టంగా.. అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కారణం చేత, ప్రజలెవరూ.. అత్యవసరమైతే.. తప్ప, ఇళ్లలోంచి బయటికి రావొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. 

 

కానీ కొంతమంది యువకులు ఆ మాటలను ఉల్లంఘించి, యద్ధవిధిగా రోడ్ల మీద తిరుగుతున్నారు. కొందరైతే కరోనా పార్టీలు చేసుకుంటున్నారు. వీటిని గమనించిన పోలీస్ శాఖ వారు, రూల్స్ ను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. అయినా కొందరు పోకిరీలు వారి ఆగడాలను మితిమీరి ప్రదర్శిస్తున్నారు. దాంతో పోలీసులు వారిని కొట్టక తప్పడం లేదు. ఈ క్రమంలో విజయవాడలోని జరిగిన సంఘటన ఒకింత ఆశ్చర్యాన్ని  కలిగించక మానదు. వివరాల్లోకి వెళితే...

 

విజయవాడలోని రామవరప్పాడు సర్కిల్ దగ్గర శ్రీధర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా..  వాహనాలను నియంత్రిస్తున్న టైంలో అటువైపునుండి అతి వేగంగా దూసుకొచ్చిన ఓ క్వాలిస్ వాహనం.. శ్రీధర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు గాయాలు తగలడంతో, వెంటనే తేరుకున్న తోటి సిబ్బంది కానిస్టేబుల్‌ శ్రీధర్‌ను మరో వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

 

అసలు, మమ్ముగానే లాక్ డౌన్ నేపథ్యంలో ఎవ్వరూ బయట తిరగడానికి రైట్ లేని సందర్భంలో ఇలాంటి సంఘటనలు సదరు పోలీసు శాఖ వారికి ఒకింత ఇబ్బందిని, అసహనాన్ని కలుగజేస్తున్నాయి. ప్రజలు ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇది కేవలం వారి శ్రేయస్సుకోసమేనని, అందరూ అర్ధం చేసుకొని మసలుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: