దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా మారింతో అందరికీ తెలిసిందే.  దాంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేశారు.  ప్రస్తుతం కరోనా ప్రబలిపోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరినీ బాధ్యతాయుతంగా ఇంటిపట్టున ఉండమరని చెబున్నారు ప్రభుత్వం. తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రజా నియంత్రణ చర్యల్లో కేవలం పోలీసులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారని, ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా కనిపించడంలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.  ఇటీవల ప్రజలు ఎంతో నమ్మకంగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు ఎక్కడా కనిపించడం లేదని.. మీకు ఏమీ బాధ్యతలు ఉండవా.. లేరనుకుంటున్నారా? హెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారని, వారందరూ ఏమయ్యారని సూటిగా ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులుగా మీకు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. పోలీసులు, డాక్టర్లు ఎంతగా సేవ చేస్తున్నారో...అంతకన్నా ఎక్కువ బాధ్యత మీకు ఉంటుందని అన్నారు. 

 

హైదరాబాద్ విషయానికొస్తే మూడు పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయని, సిటీ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అందరు శాసనసభ్యులు అందరూ దయచేసి ప్రజానియంత్రణ చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు. సిగ్నళ్లు, కూడళ్లు వద్ద నిలుచుని లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలని అన్నారు.  చేనుకు చీడ పడితే ఒకటీ రెండు తీసేస్తే సరిపోదు.. ఎక్కడ ఉన్నా మొత్తం మందు చల్లాలి. కరోనా వైరస్ భూతాన్ని తరమడానికి డాక్టర్లు, పోలీసులు మాత్రమే కాదు ప్రజా ప్రతినిధులు కూడా విధిగా పనిచేయాలని అన్నారు. 

 

రైతుల గురించి చెబుతూ, వరి, మొక్కజొన్న పంటల కొనుగోళ్లను ప్రభుత్వం చేపడుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  గ్రామాల్లోనే రైతులకు కూపన్లు ఇచ్చి వారి సొంతూళ్లలోనే కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెంచినవారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.  ఇక తెలంగాణలో లాక్ డౌన్ విషయంలో ప్రజలు కూడా ఇంటిపట్టునే ఉంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: