దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోన్న నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రెండు మూడు రోజులుగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌న‌బ‌డ‌టం లేదని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ మ‌హమ్మారిని అరిక‌ట్టేందుకు 21 రోజుల స‌మ‌యాన్ని వారు కోరారు. మంగళవారం అర్ధరాత్రి 21 రోజులపాటు దేశం మొత్తం లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్రకటించారు.   ఈ మూడు వారాలను మీ జీవితంలో మర్చిపోండని దేశ ప్రజలను ఆయన కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అని ప్రధాని మోదీ తెలిపారు.

 

 మీ ఇళ్ల ముందు లక్ష్మణ రేఖ ఉందన్న ప్రధాని మోదీ గడప దాటి బయటకు రావొద్దన్నారు.  రానున్న 11 రోజుల స‌మ‌యం మ‌న‌కు ఎంతో కీల‌కం. ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో జాగుర‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి.  ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు సామాజిక దూరం పాటించ‌డం మిన‌హా వేరే దారి లేదు. కాబ‌ట్టి ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని కోరుతా ఉన్నాను.  ఈ హెచ్చ‌రిక‌లు  దేశ ప్ర‌ధానిగా చెప్ప‌డం లేదు. మీ ఇంట్లో ఒక‌డిగా...మీ కుంటుంబంలో ఒక స‌భ్యుడిగా విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. మీకు చేతులెత్తి మొక్కుతాను.. మీరు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కి రావొద్ద‌ని కోరుతా ఉన్నాను అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. వ్యాధి లక్షణాలున్న వారే కాకుండా అందరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. నేటి అర్ధ‌రాత్రినుంచి ప్ర‌తీ ఊరు, ప్ర‌తీ వీధి, ప్ర‌తీ ప‌ట్ట‌ణం, వాడ లాక్‌డౌన్ అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.


ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. క‌రోనా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు  భారతీయులంతా కలిసి క‌రోనాపై పోరాడాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. మ‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప‌రిశుభ్ర‌ల‌తోనే దాన్ని ఎదుర్కొగ‌ల‌మ‌ని అన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ అనేది మన సమాజం కోసం, మన కుటుంబం కోసమే అని గుర్తించాలి. మీరు, మీ పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు.. దేశం మొత్తాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌న్నారు. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్ విధిస్తున్నాం. భారత్‌ను కాపాడుకోవడం కోసం, దేశ ప్రజలను కాపాడుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. రాత్రి నుంచి ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు’’ అని ప్రధాని మోదీ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: