కరోనాను కట్టడి చెయ్యాలి అంటే ఇప్పుడు ప్రభుత్వాలతో అయ్యేది మాత్రమే కాదు. దేశం మొత్తం దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రతీ ఒక్కరు ముందుకి వచ్చి ప్రభుత్వాలకు తమ వంతు సహకారం అందించాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఇది. దేశ ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వాలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తేనే దాన్ని అదుపు చేయడం అనేది సాధ్యమవుతుంది. ఇటలీ సహా అనేక దేశాలు ఇప్పుడు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నాయి అంటే ప్రజల సహకారం లేక. 

 

ఇప్పుడు దేశంలో పరిస్థితి చేయి దాటిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని విధాలుగా కరోనాను కట్టడి చేయడం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం అని చెప్పుకోవాలి. అప్పుడే మనం మనుగడ సాధించడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ భవిష్యత్తుని పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయన ఏకంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. దేశ భవిష్యత్తు మీద ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. అన్ని విధాలుగా కూడా దేశం నుంచి సహకారం అందాలి. 

 

ప్రజలు ఎవరూ కూడా ఇష్టం వచ్చినట్టు బయటకు రావొద్దు. మోడీ తీసుకున్న నిర్ణయం నిజంగా సాహసోపేత నిర్ణయం అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దేశం మొత్తం మోడికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్ లు దాదాపు రెండు నెలల నుంచి నష్టాల్లో ఉన్నాయి. ఒక దేశం 21 రోజులు పాటు లాక్ డౌన్ అంటే అది ఏ స్థాయి నిర్ణయమో అందరికి అర్ధమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది మన చేతుల్లో ఉన్న వ్యవహారం. మన ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం ఇంటి నుంచి బయటకు రాకపోవడం. మోడీ తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు యావత్ దేశం మద్దతు ఇస్తుంది సలాం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: