తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ను అరికట్టేందుకు  ఇప్పటికే కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలోనే మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్  నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రేషన్  సరుకులను ఎక్కువ మోతాదులో ఇవ్వడం తో పాటు ప్రతి రేషన్ కార్డు కి 1500 రూపాయల నగదు అందజేసేందుకు నిర్ణయించింది కేసిఆర్ సర్కార్. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి అంటూ  సూచించండి. 

 

 

 అయితే ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా చాలామంది నిర్లక్ష్యంగా రోడ్లపైకి వాహనాలతో వచ్చి  ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నీరు కారుస్తున్నారు . ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ ను  తరిమి కొట్టాలి అనే ప్రభుత్వ సంకల్పం కాస్త దెబ్బ తింటుంది. అయితే ఇలా కరోనా  వైరస్ పై  ప్రజలు సహకరించకపోవడం పై తెలంగాణ సర్కారు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా కరోనా  మహమ్మారి విజృంభన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే లాక్ డౌన్  విధించిన పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

 

 

 ఈ సందర్భంగా కరోనా  వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు పాకింది అంటూ  వెల్లడించారు. తెలంగాణలో విదేశాల నుంచి వచ్చిన వారు వారిని కలిసిన వారు ఇలా మొత్తం 19300 మంది పై నిఘా పెట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు అంటూ తెలిపిన కేసీఆర్ ప్రజలందరూ..ప్రజలు  100% సహకరిస్తేనే ఇది సాధ్యమౌతుంది అని తెలిపారు. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ లాట్ డౌన్ డౌన్ బ్రేక్  చూస్తే.. అన్ని సర్వీసులు క్యాన్సల్ అవుతాయి అంటూ హెచ్చరించారు. లాక్ డౌన్ బ్రేక్ చేసిన వారి  డ్రైవింగ్ లైసెన్స్,  పాస్ పోర్ట్,  రేషన్ కార్డు ఇలా అన్ని కార్డులు క్యాన్సల్ అవుతాయి అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: