ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 40 వరకు చేరుకుంటున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్… రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు.  అయితే ఈ లాక్ డౌన్ ఉన్నా…చాలాచోట్ల ప్రజలు రోడ్ల పైకి వచ్చేసారు. దీంతో పోలీసులు లాఠీ ఝళిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పట్టణప్రాంత  ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల పై కనిపించారు. ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పిన ప్రజలు ఈ విధంగా వ్యవహరించడంతో కేసీఆర్...ఇక నుంచి కఠినంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.

 

ప్రజలు సూచనలు పాటించకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వస్తాయని... అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని... ఆర్మీని తెచ్చుకోవద్దని కేసీఆర్ అన్నారు. అంతా దయచేసి రూల్స్ పాటించాలని కోరారు. ఎవరి ఇంటి దగ్గరే వారే ఉండాలని, ఏమన్నా ఎమర్జన్సీ ఉంటే 100 కు ఫోన్ చేయాలని, పోలీసులు సాయం చేస్తారని చెప్పారు,

 

ఇక సాయంత్రం 6 తరువాత షాపులు ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దని, అలా చేస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. కొందరు అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు

 

అయితే నగర ప్రజలు ఎక్కువ రోజులు లాక్ డౌన్ ఉంటుందనే పరిస్థితులు నేపథ్యంలో, వారు ఎలాగైనా తమ సొంత ఊర్లకు వెళ్లిపోవాలని చూస్తున్నారు. పైగా హైదరాబాద్ ప్రాంతంలో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండటంతో, భయపడుతున్నారు. అందుకే లాక్ డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి చాలామంది తమ ఊర్లకి వెళ్లే పనిలో ఉన్నారు. అది కూడా సొంత వాహనాలు ఉన్నవారే సిటీ దాటే కార్యక్రమం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలు నగరం దాటి వెళ్లోద్దని చెప్పిన సరే, ఇలా బయటకు రావడంతో  సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: