కరోనా వైరస్...ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పేరు. ఈ వైరస దెబ్బకు ప్రపంచం స్థంభించిపోయింది. వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు.  అయితే ఈ కరోనా బారిన పడకుండా భారతదేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు  కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

 

ప్రజలు ఎక్కడివారు అక్కడే ఇళ్లల్లో ఉండిపోవాలని చెబుతున్నారు. నిత్యావసర వస్తువులకు పగటి సమయంలో ఇంటి నుంచి ఒక్కరే బయటకెళ్లి తెచ్చుకోవాలని అంటున్నారు. అయితే అనవసరంగా గుంపులు గుంపులుగా చేరినా, రోడ్ల మీదకొచ్చినా, పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రోడ్ల మీద బైక్స్, కార్లు వేసుకుని తిరుగుతూ కనిపిస్తే లాఠీ పట్టుకుని పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అయితే రాష్ట్రాలు ఇంత కఠినంగా లాక్ డౌన్, పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం కరక్టేనా అంటే? ముమ్మాటికీ కరెక్ట్ అని చెప్పొచ్చు.

 

ఇప్పటికే కరోనా దెబ్బకు ఇటలీ, చైనా, దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాలు అల్లల్లాడుతున్నాయి. ఆ దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కరోనా బాధితులు పెరిగిపోయారు. ఇక అదే తప్పుని భారత్ చేయాలని అనుకోవడం లేదు. అందుకే కరోనా ప్రారంభ స్టేజ్ లోని చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే జనతా కర్ఫ్యూ నిర్వహించారు.

 

ఇక ఇటు అనేక రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి, కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రజలని ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దంటూ పిలుపునిచ్చాయి. అయితే ప్రభుత్వ విజ్ఞప్తిని పట్టించుకోకుండా కొందరు రోడ్లు ఎక్కేసారు. దాంతో పోలీసులు యాక్షన్ లోకి దిగాల్సి వచ్చింది. ఏదో అవసరానికి తప్ప, ఉత్తిగా రోడ్లు మీద తిరిగే వాళ్లకు గట్టిగానే కోటింగ్ ఇస్తున్నారు. ఇక ఇలా చేయడం వల్ల మిగతా వాళ్ళు రోడ్లు మీదకు రావడానికి భయపడతారు. కరోనా వైరస్ పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. అసలు కరోనాకు మందు లేదురా బాబు, ఎవరి ఇళ్లలో వారు ఉండటమే దీనికి పరిష్కారం అంటూ ప్రభుత్వాలు సూచనలు చేసిన, పట్టించుకోకుండా తిరిగేవాళ్లకు ఆ మాత్రం కోటింగ్ పడటంలో తప్పు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: