కరోనా వైరస్ పై యావత్ దేశం పోరాటం ప్రకటించింది. కరోనా వైరస్ తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తుంది. ఇక ఇటు కరోనా ప్రభావం తక్కువ ఉన్న ఏపీలో కూడా సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7 కరోనా కేసులు నేపథ్యంలో రాష్ట్రాన్ని షట్ డౌన్ చేశారు. ఎవరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం కరోనా వైరస్ పై పోరాటం చేస్తోంది.

 

దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల్ని సేకరించి, వారికి కరోనా టెస్టులు చేయిస్తున్నారు. అలాగే ఆరోగ్యం బాగోని వారి డేటా సేకరించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రజలకు రూ. వెయ్యి రూపాయలు, రేషన్ ని వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి సరఫరా చేయనున్నారు. అయితే లాక్ డౌన్  పాటించాలని ప్రాణాలను కాపాడుకోండి అని ప్రభుత్వం చెబుతున్నా వినకుండా ప్రజలు  నిత్యావసరాల కోసం రోడ్డుపైకి వస్తున్నారు.

 

అలా రోడ్లపైకి రావడం వల్ల కరోనా ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజల శ్రేయస్సు కోసం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ శాతం పట్టణ ప్రజలు సరుకులు, కూరగాయలకు వస్తున్న క్రమంలో ప్రతి కాలనీకు కూరగాయలు, నిత్యావసర సరుకులను అందించే కార్యక్రమం చేయనున్నారు.  నిత్యావసర వస్తువుల్ని తోపుడు బళ్లపై విక్రయించనున్నారు.

 

ఇక దీని వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ప్రజలు రోడ్ల పైకి వచ్చే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా కరోనా వ్యాప్తిని కాస్త అడ్డుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే సీఎం జగన్ ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టి, కరోనా పై మాటలు చెప్పకుండా, చేతల్లో కరోనాని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: