ఇప్పటివరకు ఒకలెక్క ఇప్పటి నుండి ఒక లెక్క.. చెబితే వినకుంటే ఇక ముందు వినడానికి చెవులు లేకుండా చేసే పరిస్దితులు వస్తున్నాయి.. ఇదే కాకుండా మేం ఉప్పుకారం ఎక్కువ తింటాం.. తెలంగాణ బిడ్దలం అంటు ఓవర్ బిల్డప్ ఇచ్చారంటే చ్చచ్చినట్లే.. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్దితి చేయిదాటక ముందే జాగ్రత్త పడితే మంచిది.. చేయి దాటిందంటే ఎన్ని కోట్లు ఖర్చు చేసిన అదుపులో ఉండదు కాబట్టి ప్రభుత్వాల మాటలు చెవికి ఎక్కించుకుని ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని ఉంటే మంచింది..

 

 

ఇప్పటికే కేసీయార్ మంచి మాటతో చెబుతున్నాడు.. ఇలా కాదని వినకుండా ప్రవర్తిస్తే కాల్చి చంపేస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు.. అంతే కదా.. ఇన్ని కోట్ల మందికి మంచి జరగాలంటే ఆ మాత్రం చర్యలు తీసుకోక తప్పదు.. ఇప్పటికే ప్రధాన మంత్రి మోడీ గారు  చెతులెత్తి కూడా దండం పెడుతున్నారు.. మొండి మనుషుల్లారా అర్ధం చేసుకోండి.. మీ కోసం.. మానవ జాతి కోసం ఇదంతా చేస్తుంటే.. పెడచెవిన పెట్టి వెధవల్లా ప్రవర్తించకండి.. ఇన్నాళ్లు ఎవరి మాట వినకుండా బ్రతికారు.. పోలీసులు చలాన్ వేస్తే డబ్బులు కట్టారు.. కానీ ఇప్పుడున్న లెక్క వేరు.. తేడా వస్తే ఇవన్ని చేయడానికి ప్రాణాలు ఉండవు.. ఇప్పుడు కనుక తగిన విధంగా జాగ్రత్త పాటించకపోతే మనుషులుగా పుట్టినందుకు సిగ్గుపడవలసి వస్తుంది.. ఇలాంటి పరిస్దితుల్లో పెద్దవారు చెప్పె మాటలను మొదడుకు ఎక్కించుకుని ఈ సమాజాన్ని కాపాడుదాం.. మనల్ని మనం రక్షించు కుందాం..

 

 

ఇకపోతే రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితి విధించిన నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, అమెరికా లాంటి అగ్రరాజ్యమే కలవరపడుతోంది. అందువల్ల అందరం అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వానికి సహకరించాలి. లేకపోతే ఈ విషయంలో నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. స్థానిక పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే.. ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆటోమెటిగ్గా 24 గంటలు వాళ్ల కంట్రోల్‌లోకి వెళ్తుంది. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది’ అని కేసీఆర్ హెచ్చరించారు.. సో వినండి భవిష్యత్తును కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: