ప్రపంచాన్ని చిగురుటాకు మాదిరిగా వణికిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశం లోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ విపత్తు సమయం లో ప్రభుత్వాలు ముందుకొచ్చి ,  పేద లను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి . దీనితో సినీ , రాజకీయ , వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు  సీఎం ఆర్ ఎఫ్ కు తమవంతుగా  విరాళాన్ని అందజేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు .   కరోనా కట్టడికి ముఖ్యమంత్రి సహాయనిధికి తన  ఒక నెల జీతం విరాళం అందజేయడమే కాకుండా వ్యక్తిగతంగా పది లక్షల రూపాయలు అందజేయనున్నట్లు  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు  .

 

టీడీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ తమ ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి కి అందజేయాలని నిర్ణయించారు . ఈ విషయాన్ని  టీడీపీ సీనియర్ల తో చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా వెల్లడించారు . ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి అండగా నిలువాలని చంద్రబాబు కోరారు . కరోనా కట్టడి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి పలువురు విరాళాన్ని అందజేస్తూ  తమ ఉదారతను  చాటుకుంటున్నారు .  హీరో నితిన్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధి కి విరాళాన్ని ప్రకటించారు .

 

 ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తాను ప్రకటించిన విరాళాన్ని చెక్ రూపం లో అందజేశారు . ఇక మైక్రో సాఫ్ట్ సీ ఈ ఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ల,  తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి కి రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు . ఆ మొత్తాన్ని చెక్ రూపం లో ఆమె తండ్రి మాజీ ఐఏఎస్ అధికారు వేణు గోపాల్ , ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు . లాక్ డౌన్ కారణంగా నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడుతున్న పేదల అవసరాల కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని అనుపమ నాదెళ్ల కోరారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: