కరోనా.. చైనాలో పుట్టి అక్కడి నుంచి ప్రపంచానికి పాకింది.. ఎక్కడో ఉన్న ఇటలీలో జనం పిట్టల్లా రాలుతున్నారు.. యూరోప్‌లోని స్పెయిన్ లోనూ అంతే పరిస్థితి. అటు అమెరికాలోనూ సేమ్ సీన్.. ఇలా ప్రపంచమంతా చైనా నుంచి కరోనా వైరస్ పాకేసింది. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. చైనా పక్కనే ఉన్న రష్యాలో మాత్రం అంత సీన్ లేదు. అందులోనూ చైనాతో రష్యాకు సరిహద్దు కూడా ఉంది.

 

 

మరి రష్యా కరోనాను ఎలా కంట్రోల్ చేసింది. ముందే మేలుకొనడం.. కఠిన నిబంధనల ద్వారానే ఇది సాధ్యమైందట. ఈ విషయాన్ని కేసీఆర్ తెగ మెచ్చుకున్నారు. తెలంగాణలో నిబంధనలను కఠినతరం చేసిన కేసీఆర్.. అదే సమయంలో రష్యా తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ.. ఆ దేశం చాలా గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు. ఇంతకీ రష్యాలో ఏం చేశారంటే.. దేశం మొత్తం లాక్ డౌన్ చేసి.. బయటకు వస్తే ఐదేళ్ల జైలు శిక్ష అంటూ నిబంధన పెట్టేశారు.

 

 

దీంతో.. దెబ్బకు రష్యాలో జనం బయట తిరగడం మానేశారట. మరి తెలంగాణలో కూడా అలాగే చేయమంటారా అంటూ ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. కరోనా విస్తరణ రోజు రోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా రోడ్ల మీదికి వస్తున్నారు. అందుకే రాష్ట్రాన్ని రక్షించుకునే క్రమంలో ఎలాంటి నిర్ణయమైన తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.

 

 

సమాజానికి ఇబ్బంది కలిగిస్తే… అన్ని లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. మాట వినకపోతే… తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల కర్ఫ్యూ తప్పదని హెచ్చరించారు. అది వినకపోతే.. ఆర్మీని రంగంలోకి దింపక తప్పదని.. షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇస్తామన్నారు. మరి ఇప్పటికైనా జనం దారిలోకి వస్తారా లేదా అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: