తెలంగాణ లాక్‌డౌన్‌లో ఉంది. తెలంగాణ ఏంటి.. అసలు దేశమే లాక్ డౌన్ లో ఉంది. ఈ దశలో తెలంగాణలోని కొందరిక మాత్రం ఈ లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వారు ఎవరంటే.. ప్రధానంగా రైతులు.. గ్రామాల్లో వ్యవసాయం ఆగకూడదు కాబట్టి రైతులకు వారు పొలం పనులు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే వారు కూడా గుంపులుగా వెళ్లకూడదని కేసీఆర్ తెలిపారు.

 

 

రైతులు పంటలు పండించకపోతే.. మొత్తం రాష్ట్రానికే తిండి ఉండదన్న కేసీఆర్ వారికి ఎలాంటి ఆంక్షలు ఉండబోవన్నారు. ఇక వారితో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేసుకునే కూలీలకు కూడా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వారు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ కూలీ పనులు చేసుకోవచ్చని సూచించారు. ఇక వీరి తర్వాత తెలంగాణలోని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కోసం పని చేస్తున్న కూలీలకు కూడా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

 

 

కాకపోతే.. వీరితో పని చేయించే కాంట్రాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వారికి కరోనా సోకకుండా సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆ బాధ్యత కాంట్రాక్టర్లపైనే ఉంటుందని కేసీఆర్ చెప్పారు. వారు పని చేసే పని ప్రాంతాల్లో శానిటైజేషన్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కేసీఆర్ చెప్పారు.

 

 

ఇక వీరితో పాటు మీడియాపై కూడా లాక్ డౌన్ సమయంలో ఎలాంటి ఆంక్షలూ ఉండబోవన్నారు. వారికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. అత్యవసర సేవల కింద మీడియాకు బయట తిరిగే స్వేచ్చ వార్తలు సేకరించే స్వేఛ్ఛ ఉందని తెలిపారు. అక్కడక్కడా మీడియాను అడ్డుకుంటున్నట్టు కొన్ని వార్తలు తన దృష్టికి వచ్చాయన్న కేసీఆర్.. ఇకపై అలా జరగకుండా చూస్తామని చెప్పారు. ఒకటీ అరా చిన్న చిన్న ఇష్యూలు ఉంటే మీడియా కూడా కాస్త సర్దుకోవాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: