తెలంగాణ కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు  పెరిగిపోతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ ప్రకటిస్తూ ప్రజలందరినీ ఇళ్ళకు మాత్రమే ఇప్పుడు తను కావాలంటూ సూచించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పై  చేసే పోరాటానికి ప్రజల అందరి సహకారం కావాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ప్రభుత్వ నిబంధనలు ప్రజలందరూ...  తప్పకుండా పాటిస్తే కరోనా  వైరస్ ను  రాష్ట్రం నుంచి తరిమికొట్టొచ్చు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. 

 

 

 ఇదిలా ఉంటే కరోనా  వైరస్ కరెన్సీ నోట్ల ద్వారా వస్తుంది అనే విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరింత భయాందోళన  నెలకొంటుంది. ఎందుకంటే కరెన్సీ నోట్ల మార్పిడి మామూలుగానే ఎక్కువగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏ కరెన్సీ నోట్ నుంచి ప్రాణం మీదికి వస్తుందో అని అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలందరికీ కరెన్సీ వాడకంపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. 

 

 

 

 కరెన్సీ నోట్ల మార్పిడి ద్వారా కరోనా  వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున... రాష్ట్ర ప్రజలందరూ ఎక్కువగా డిజిటల్  పేమెంట్ చేయాలి అంటూ సూచించారు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. కరెన్సీ నోట్లను మార్చుకోవడం తగ్గించాలి అంటూ  తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో... ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు,  అత్యవసర సేవల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలు పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలిపారు. అంతేకాకుండా మాంసం, చేపలు,  కోడిగుడ్లు మార్కెట్ లు  తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో... ఆయా దుకాణాలను నడిపించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను  కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: