ప్రపంచం మొత్తం కరోనాతో యుద్ధం చేస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటికి దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 4 లక్షల వరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 18 వేల మంది వరకూ కరోనా బారిన పడి చనిపోయారు. ఇటలీ, స్పెయిన్ , ఇరాన్ వంటి దేశాలు చావు దెబ్బ తింటున్నాయి. కరోనా వైరస్ తో సుమారు 197 దేశాలు అల్లల్లాడిపోతున్నాయి.

 

 

ప్రపంచమంతా సీన్ ఇలా ఉంటే.. అసలు ఈ కరోనా వైరస్ పుట్టిన చైనా మాత్రం ఇప్పుడు రిలాక్స్ అవుతోంది. కరోనాకు గుడ్ బై చెబుతోంది. ఈ మహమ్మారిని అదుపు చేయడంలో సక్సస్ అయిన చైనా ఇప్పుడు ఎంజాయ్ మూడ్‌లోకి వచ్చేస్తోంది. కరోనా బాగా ప్రబలిన హుబీ ప్రావిన్స్ లో ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తేసింది. గత డిసెంబరు రెండో వారం నుంచి వూహాన్ సిటీ, ఆ తరువాత హుబీ ప్రావిన్స్ లో కరోనా వెలుగు చూసింది.

 

 

కరోనా ప్రబలిన తీరు చూసి ప్రపంచ మంతా నివ్వెరపోయింది. కరోనా కట్టడి కోసం చైనా ఆ వైరస్ పై యుద్దమే చేసింది. ఈ వార్తలు వచ్చే సమయంలో మిగిలిన ప్రపంచం అదో చైనా బాధ కింద జమకట్టాయి. లైట్ గా తీసుకున్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం వణికిపోతోంటే చైనా కాస్త రిలాక్స్ అవుతోంది. చైనా ప్రభుత్వం చేబట్టిన కఠిన చర్యల వల్ల అక్కడ కరోనా కట్టడి సాధ్యమైంది.

 

 

హుబే ప్రావిన్స్‌ లో ఇప్పుడు ప్రయాణ సంబంధ ఆంక్షలను తొలగించేశారు. ఆరోగ్యవంతులైన ప్రజలు నిరభ్యంతరంగా ప్రయాణించవచ్చని తెలిపారు. వూహాన్ సిటీలో మాత్రం ఏప్రిల్ 8 వరకు ఇవి అమల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు కరోనాతో బ్రిటన్, అమెరికా, నార్త్ అమెరికా, ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలు లాక్ డౌన్ల మధ్య నలుగుతున్నాయి. ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: