ప్రపంచ వ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అన్ని దేశాలు కరోనా పేరు చెబితే చాలు వణికిపోతున్నాయి. కోరలు చాచిన కరోనా రాక్షషిని ఎలా తరిమి కొట్టాలో తెలియక అన్ని దేశాలు సతమతం అయిపోతున్నాయి. ఒక వైపు కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే మరో వైపు చైనాలో కొత్తగా హంట వైరస్ పుట్టుకొచ్చేసింది. అసలు ఈ కొత్త కొత్త వైరస్ లను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అన్ని దేశాలు తలలు పట్టుకున్నాయి. కొన్ని దేశాలు ఈ కరోనా వైరస్ గురించి లైట్ తీసుకోవడంతో అక్కడ తీవ్ర స్థాయిలో విజృంభించి కోలుకోని నష్టాన్ని కలిగించింది. మన దేశంలో అటువంటి పరిస్థితి తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దేశమంతా జనతా కర్ఫ్యూ విధించి జనాలు ఎవరూ రోడ్ల మీదకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  


మొదటి రోజు జనతా కర్ఫ్యూ కి స్పందన బాగానే వచ్చింది. జనాలు ఎవ్వరూ ఇళ్లల్లోంచి బయటకి రాకుండా ఉండిపోయారు. అయితే రెండో రోజు మాత్రం పరిస్థితి కాస్త అదుపు తప్పినట్టు కనిపించింది. దీంతో కఠిన నియమ నిబంధనలు అమలు చేయకపోతే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే అవకాశం ఉందని భావించే మరికొన్ని కఠిన నియం నిబంధనలు రూపిందించారు. అయినా జనాల్లో మాత్రం పెద్దగా మార్పు అయితే కనిపించలేదు. పోలీసుల కళ్ళు కప్పి కొందరు, పోలీసులతో లాటి దెబ్బలు తింటూ కొందరు మొత్తానికి రోడ్లమీదే తచ్చాడుతూ తిరుగుతున్నారు. ఇక హైదరాబాద్ వంటి నగరాల్లో రైతు బజార్ల వద్ద పరిస్థితి అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. కూరగాలయాలను లూటీ చేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అమ్మాల్సి రేట్ల కంటే అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నారు అంటూ ఆందోళన చేయడమే కాకూండా ఎవరికి దొరికినవి వారు ఎత్తుకెళ్లారు.


 రెండు రోజుల క్రితం ఉన్న ధరలకు నేటి ధరలకు తేడా చూపిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇవన్నీ పోలీస్ పంచాయితీల వరకు  ఇవన్నీ పక్కన పెడితే నిత్యావసరాలకోసం వచ్చే వారు షోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ఒకరిపై మరొకరు సమూహాలుగా పడిపోవడం ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే కరోనా వ్యాప్తికి ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా జనాల్లో ఇంకా దీనిపై అవగాహన రావడంలేదు. ప్రభుత్వాలు ఏదో జనాలను ఇబ్బందులు పెట్టేస్తున్నాయి అనే ఫీలింగ్ లో ఉంటున్నారు తప్ప ఎవరికి వారు బాధ్యత తీసుకుని జాగ్రత్తలు పాటించలేకపోతున్నారు. ఇవాన్నీ అంచనా వేసే తాజాగా ప్రధాని మోదీ లాక్ డౌన్ ను మరికొంతకాలం పొడిగించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: