తెలుగు రాష్ట్రాలలో ఉన్న చెత్త మీడియా మరే రాష్ట్రంలో ఉండదని చాలామంది ప్రముఖ రాజకీయ నేతలు విమర్శిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులగజ్జి...ఉద్దేశపూర్వక మైన రాజకీయ కథనాలు ఏ రాష్ట్రంలో మీడియా చూపించవనీ అంటారు. అదేవిధంగా పత్రికారంగం కూడా మొత్తం బ్రష్టు పట్టిపోయింది అని కేవలం కొద్దిపాటి పత్రికలు మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా చూపించడం జరుగుతుంది అంటూ చాలా మంది నేతలు చెబుతుంటారు. ముఖ్యంగా బాబోరు మీడియా అయితే అతిగా కథనాలు ప్రచురించడం లో తప్పుడు వార్తలు రాయటంలో ముందు ఉంటుందని చాలామంది చెబుతుంటారు.

 

అయితే ఇప్పుడు ఆ మీడియా ఛానల్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా ప్రకటనలు ఇంకా అనేక రీతులుగా ఓ వెలుగు వెలిగిన మీడియా చానల్స్ ప్రస్తుతం మూతపడే స్టేజికి వచ్చినట్లు ఏపీ మీడియా రంగంలో సరికొత్త గా వార్తలు వస్తున్నాయి. రోజు రోజుకి మీడియా సత్తా ఏంటో ప్రజలందరికీ తెలిసిపోతున్న తరుణంలో...సదరు మీడియా చానల్స్ కాలం చెల్లిపోయింది. ప్రస్తుతం మీడియా రంగంలో ఉన్న కొద్దీ వెబ్ మీడియా, సోషల్ మీడియా పాపులారిటీ పెరిగిపోతోంది. చానెళ్లు కూడా తమ కంటెంట్ ను వెబ్ మీడియాలో అప్ లోడ్ చేసి, లేదా యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి సంపాదించుకోవాల్సి వస్తొంది తప్ప, మెయిన్ స్ట్రీమ్ లో కాదు.

 

ఇటువంటి టైములో కరోనా రావడంతో బాబోరు మీడియా ప్రముఖ ఛానల్ క్లోజ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు సరికొత్తగా వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా ఇదే సమయంలో ఆంధ్రభూమి దినపత్రిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు మొన్నటి వరకూ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఓ వెలుగు వెలిగిన దినపత్రిక ప్రస్తుత కాంపిటేషన్ లో నెట్టుకు రావడం లో యాజమాన్యం విఫలం కావటంతో ...మూత పడటానికి రెడీ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: