దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 39కు చేరగా ఏపీలో 8కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రతి రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. ఏపీలో కరోనా ప్రభావం కొంత తక్కువగానే ఉన్నా తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం గమనార్హం. 
 
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. నిన్న రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 
 
ప్రజలకు కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు, అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ప్రజలు నిర్దేశించిన సమయంలో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశమంతటా రాత్రి 7 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రోడ్లపైకి ఎవరినీ అనుమతించరు. 
 
రాత్రి వేళల్లో కేవలం మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాళ్లను మాత్రమే అనుమతిస్తారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు మూతపడతాయి. బ్యాంకులు, ఏటీఎంలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.బ్యాంకులు ఆయా రాష్ట్ర ప్రభుతాల నిబంధనల మేరకు పని చేయనున్నాయి. . రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగకుండా చర్యలు చేపడుతున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా నిబందనల అమలు జరిగేలా ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: