కరోనా వ్యాప్తి దేశంలో ఎంత వేగంగా వ్యాపిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు రైల్వే శాఖ కరోనా బాధితులకు వైద్య పరికరాలు అందించనుంది. ఈ పరికరాలను రైల్వే జోనల్ వర్క్ షాపుల్లో తయారు చేస్తున్నట్లు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా అన్ని రంగాలు మద్దతు ప్రకటిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటి నుంచి 21 రోజుల వరకు లాక్ డౌన్ చేసింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. రద్దిని నియంత్రించడానికి ప్లాట్ ఫాం టికెట్ ధరను పెంచిన సంగతి తెలిసిందే. 

 

అయితే తాజాగా రైల్వే శాఖ ఐసో లేషన్ వార్డులో కరోనా బాధితులకు అవసరానికి కావలసిన బెడ్స్, మాస్క్, శానిటైజర్స్, వాష్ బేసిన్ తదితర పరికరాలను రైల్వే జోనల్ వర్క్ షాపులో తయారు చేయనుంది. ఈ జోనల్ వర్క్ షాపుల్లో చిత్తరంజన్ లోకో వర్క్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కపర్తలా, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, రైల్వే వీల్ ఫ్యాక్టరీ, యలహంక, ఢీజిల్ వర్క్ వారణాసిలో ఈ పరికరాలు తయారు చేయనున్నారు. 

 

దీనికి సంబంధించి తయారీ కేంద్రాల వర్క్ షాప్ మేనేజర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్క్ షాప్ మేనేజర్లు తమ పరిధిలోని ప్రధాన వైద్యాధికారి కి సంప్రదించి బాధితుల అవసరాలకు తగ్గట్లు పరికరాలు తయారు చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

 

బాధితులను ఐసోలేషన్ వార్డులో ఉంచడం వల్ల కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న చర్యలకు అందరూ కట్టుబడి ఉండి, కరోనా ను నిర్మూలించడానికి అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ లో అందరూ పాల్గొని ప్రజలు ఇంటికే పరిమితం అయి అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలని సూచించారు. కఠిన చర్యల ద్వారా కొంత మేరకు అయినా నివారించవచ్చు అని ప్రభుత్వం ఆశిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: