కరోనా వైరస్ తీవ్రత చేయి దాటిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇన్నాళ్ళు కరోనా వలన ఏ ఇబ్బంది లేదని భావించినా ఇప్పుడు దాని తీవ్రత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా తీవ్రత ఇంత వేగంగా పెరుగుతుంది అని ప్రభుత్వాలు కూడా అంచనా వేయలేకపోయాయి. ఇప్పుడు ఈ వైరస్ ఉత్తర భారతంలో అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర లో కరోనా కేసుల సంఖ్య సెంచరీ దాటేసింది. అక్కడ దాదాపుగా పరిస్థితి చేయి దాటింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 

 

వేలాది మంది విదేశాల నుంచి వచ్చి ఉంటారు. వారిని ముందు నుంచి కట్టడి చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మహారాష్ట్ర లో విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉండటం వాళ్ళు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం తో రాష్ట్రం మొత్తం వాళ్ళు వెళ్ళిపోయారు. దీనితో వ్యాధి అత్యంత వేగంగా విస్తరించింది వాళ్లకు. దీనిని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సరే అది అదుపులోకి వచ్చే అవకాశం కనపడటం లేదని అంటున్నారు. వ్యాధి మహారాష్ట్రలో గ్రామ స్థాయిలో కి వెళ్లిపోయింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. 

 

అందుకే ఇప్పుడు అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గింది అంటున్నారు. ఇది ఏ విధంగా అదుపు చెయ్యాలి అనేది అర్ధం కావడం లేదు. దేశ వ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. దీనిని చూసిన నిపుణులు అయితే పరిస్థితి చేయి దాటిపోయింది అంటున్నారు. పరిస్థితిని అంచనా వేయడం కష్టం అనే వాళ్ళు కూడా ఉన్నారు, మరి దీనిని ప్రభుత్వాలు ప్రజలు ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: