తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు కరోనా కట్టడి విషయంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకు ఆయన చేస్తున్న హెచ్చరికలు మాత్రం నిజంగా భేష్ అనే అభిప్రాయం వినపడుతుంది. సాధారణంగా కెసిఆర్ ఎం చెప్పినా సరే తెలంగాణా చాలా జాగ్రత్తగా వింటుంది. అయితే కరోనా విషయంలో ఆయన బయటకు రావొద్దు అని చెప్పినా సరే ఎవరూ వినడం లేదు. హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇష్టం వచ్చినట్టు ఇళ్ళ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళను అదుపు చేయడం ఇప్పుడు పోలీసులకు చాలా కష్టంగా మారింది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

ఎవరు ఎన్ని చెప్పినా సరే వినడం లేదు. దీనితో కెసిఆర్ జనాలకు ఏ విధంగా చెప్తే అర్ధమవుతుందో ఆ విధంగా చెప్పారు. కనిపిస్తే కాల్చి పారేస్తామని చెప్పారు ఆయన. అలాగే వ్యాపారులు గనుక ఇష్టం వచ్చినట్టు అమ్మితే మాత్రం చర్యలు ఏ విధంగా ఉంటాయో కూడా చెప్పారు ఆయన. ప్రజలను భయపెట్టే విధంగానే కెసిఆర్ చెప్పారు. బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సమయ౦ ఇష్టం వచ్చినట్టు అమ్మితే మాత్రం కచ్చితంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

 

అలాగే ప్రజలు బయటకు వస్తే అర్మీని కూడా దింపే అవకాశం ఉంటుందని, పోలీసులు ఇప్పుడు అమ్మా అయ్యా అని బుజ్జగించి చెప్పారని బయటకు వస్తే ఇక అలాంటి పరిస్థితి ఉండదు అని అన్నారు. ఇక కరోనా కట్టడి లో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గోనాల్సిందే అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఆయన. ఎవరికి వారు ప్రజా ప్రతినిధులు స్వచ్చందంగా బయటకు రావాల్సిందే అని కెసిఆర్ స్పష్టంగా చెప్పేశారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదని ప్రజలు మాట వినకపోతే ఎలా చెప్పాలో అలా చెప్తామని హెచ్చరించారు కెసిఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: