కరోనా విషయంలో భారత ప్రభుత్వం సహా రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రధర్శించాయా...? అంటే అవుననే వినపడుతుంది. ఒక్క తెలంగాణా ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మినహా ఎవరూ కూడా కరోనా విషయంలో అలెర్ట్ గా లేరు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చైనా సరిహద్దులను పంచుకున్న రష్యా... ఎక్కడ తమ దేశంలోకి వస్తుందో అని ముందుగానే మేల్కొంది. వెంటనే కరోనా రాకుండా ఉండటానికి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను రద్దు చేసింది. అదే విధంగా చైనా సహా పలు దేశాల సరిహద్దులను ఆ దేశం మూసి వేసింది. 

 

దీనితో రష్యాలో కరోనా అనేది చాలా తక్కువగా ఉంది. నియంతగా భావించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. ఎక్కడిక్కడ అధికారులను అప్రమత్తం చేసాడు. అయితే మన దేశం మాత్రం అంతర్జాతీయ విమానాశ్రయాలను కట్టడి చేయకుండా అంతర్జాతీయ విమానాలను రద్దు చేయకుంటా కేంద్ర ప్రభుత్వం కరోనాను లైట్ తీసుకుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా అనేది మహమ్మారి వచ్చింది అంటే అందరిని తగులుకుంటుంది. దానికి తన మన అనే భేదాలు అసలు లేవు. 

 

అలాంటి కరోనా విషయంలో ఇప్పుడు చాలా అలసత్వం ప్రదర్శించాయి లాక్ డౌన్ ని ఆలస్యంగా ప్రకటించాయి అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కాస్త అప్రమత్తం అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అని దేశంలో అసలు దాన్ని రానీయకుండా అడ్డుకునే వాళ్ళమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు జరిగే నష్టం జరుగుతుందని అది విస్తరించింది అని అడ్డుకోవడం సాధ్యం కాదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. కరోనా విషయంలో చాలా లైట్ తీసుకుని దానికి దారులు తెరిచారని అందుకే మహారాష్ట్ర సహా అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందే జాగ్రత్త పడి ఉంటే ఈ పరిస్థితి ఉండదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: