మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఇక్కడ గొడ్డుకో దెబ్బ సూత్రమే చాలా మందికి కరెక్ట్. ఎవడికి తోచినట్టు వాడు చేస్తున్నాడు దేశంలో. బయటకు రావొద్దు రా సామి ప్రాణాలు పోతాయి అని చెప్తే ఎవరూ వినడం లేదు. ఇష్టం వచ్చినట్టు బయటకు వచ్చి ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరోనా మరణ శాసనం రాస్తుంది. అర్ధం చేసుకోకుండా బయటకు వస్తే ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఊహించిన దాని కంటే అత్యంత భయంకరంగా ఉంది. కరోనా అనేది మన మాట వినదు. 

 

మనం దాని మాట వినాలి. అది చెప్పినట్టు చెయ్యాలి. అది చెప్పినట్టు చెయ్యకుండా ఉండాలి అంటే మనం ఇంటి నుంచి బయటకు రావొద్దు. దాని మాట ఎప్పుడు వినాలి అది మన దగ్గరకి వచ్చినప్పుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉంటామో చస్తామో ఎవడికి తెలియదు. ఎండలు ఉంటే రాదు వేడి నీళ్ళు పోసుకుంటే రాదు అనడం బొంబాయి మాటలు గా ఉన్నట్టే. కాబట్టి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు పోలీసులు బయటకు వచ్చిన వాళ్ళ తాట తీస్తున్నారు. 

 

ఒక్కొక్కడికి వాచిపోతుంది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది రా బాబూ ఆగండి అంటే ఎవరూ వినడం లేదు. దీనితో పోలీసులు లాఠీ లకు పని చెప్పారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బాదుడు కి తగులుకున్నారు. దీనితో జనాలకు ఒక రకమైన భయం అనేది వచ్చింది. బయటకు వెళ్తే పగిలిపోద్ది రా బాబు అనే అంచనాకు వచ్చారు అందరూ. అందుకే రెండు మూడు రోజుల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. చాలా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ విషయంలో పోలీసులు శభాష్.

మరింత సమాచారం తెలుసుకోండి: