కరోనా వైరస్ దెబ్బకు అమెరికా వణికిపోతోంది. అగ్రరాజ్యంలో  ఒక్క రోజులోనే 10 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయన్న వార్త వెలుగు  చూడటంతో మొత్తం జనాలు వణికిపోతున్నారు. పాజిటివ్ కేసులు బయటపడటం ఒక ఎత్తైతే 130 మంది ఒకేరోజు మరణించటం మరో ఎత్తు. వీరిలో 43 మంది న్యూయార్క్ వాసులే ఉండటంతో న్యూయార్క్ నగరంలో జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచమంతా కొరోనా వైరస్ నియంత్రణకు నానా అవస్తలు పడుతుంటే అమెరికా మాత్రం కాస్త నిర్లక్ష్యంగా ఉందేమో అనే అనుమానాలొస్తున్నాయి. రాబోయే రెండు వారాలే చాలా కీలకంగా మారింది. ఇండియాలో మూడు వారాలు మొత్తం లాాక్ డౌన్ అయితే అమెరికాలో 21 రాష్ట్రాలు మాత్రమే లాక్ డౌన్లో ఉన్నాయి. 

 

కొరోనా వైరస్ వెలుగు చూసేటప్పటికి పుట్టిల్లైన  చైనా తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. సరే ఓ మూడు నెలల తర్వాత ఎలాగో చైనా వైరస్ నియంత్రణను చాలా వరకూ కంట్రోల్ చేసుకోగలిగింది. అయితే చైనా నుండి ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలకు వేగంగా విస్తరించింది. ఈ దేశాల్లో కూడా ఇటలీ, ఇరాన్ వరస్ట్ ఎఫెక్టెడ్ అయిపోయాయి. అందుకే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సామెతలాగా ఇటలీ, ఇరాన్ దేశాలు ఇపుడు యుద్ధ ప్రాతిపదకన చర్యలు తీసుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

సరే పై దేశాల్లో పరిస్ధితి కంటికి కనిపిస్తున్నా అమెరికాలో మాత్రం నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనిపించటం లేదు. ఒక్క రోజులోనే అమెరికా మొత్తం మీద 10 వేల పాజిటివ్ కేసులు ఒకేరోజు నమోదయ్యాయంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే అమెరికా మొత్తం మీద 20875 కేసులు నమోదైతే 622 మంది చనిపోయారు. అమెరికా నానాజాతి సమితి అన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని దేశాల జనాలందరూ అమెరికాలోనే ఉంటున్నారు.

 

పైగా న్యూయార్క్ లో జనాలు కూడా ప్రభుత్వం చెప్పినా పట్టించుకోలేదు. న్యూయార్క్ నుండి ఫ్లోరిడా కు వెళ్ళిన వాళ్ళందరూ సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని ఇపుడు ఆదేశాలు జారీ అయ్యాయి. అమెరికాలో ఇంత వేగంగా కొరోనా విస్తరించిందంటే టెస్ట్ కిట్స్ కూడా అందుకోలేదు. సరిపడా బెడ్లు, వెంటిలేటర్లు కూడా లేవంటే విచిత్రమే. పైగా వైరస్  స్ప్రెడ్ అయ్యే విషయంలో కూడా జనాలు చాలా నిర్లక్ష్యంగా ఉండటంతో కొంపలు ముణిగిపోతున్నాయి. 35 కోట్ల మంది జనాల్లో కేవలం 4 లక్షల మందికి మాత్రమే ముందస్తు టెస్టులు జరిగాయంటే అమెరికా పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనివల్లే అమెరికాలో కొరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని అర్ధమైపోతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: