తెలంగాణాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే అది అందుబాటులోకి రావడం లేదు. తెలంగాణాలో ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కరోనా సోకుతుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే అది ప్రభుత్వానికి సవాల్ చేస్తూనే ఉంది. కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. లాక్ డౌన్ ని బలవంతంగా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వ౦. బయటకు వస్తే పోలీసులు తాట తీసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. 

 

తాజాగా తెలంగాణాలో మరో మూడు కేసులు నమోదు అయ్యాయి. కొత్తగూడెం డీఎస్పీ, వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషికి కరోనా సోకింది. డిఎస్పీ కుమారుడు ఇటీవల లండన్ నుంచి వచ్చాడు. అతనికి కరోనా సోకింది. అతని నుంచి కుటుంబానికి సోకింది. ఇప్పుడు ఆ పని మనిషి ఎక్కడికి వెళ్లిందో ఎంత మంది ఇంట్లో పని చేసిందో అని అందరూ ఆరా తీస్తున్నారు. అధికారులు అందరూ ఇప్పుడు ఆమెను అడిగి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆమె వెళ్ళిన ప్రతీ ఇల్లు షాపు గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. 

 

ఆమె కొన్ని ఇళ్ళకు తరుచుగా వెళ్తూ ఉంటుందని అధికారులు గుర్తించారు. అలాగే ఆమె ఇంట్లో కూడా పరిక్షలు చేసారు అధికారులు. ఇక డిఎస్పీ విధులు నిర్వహించారా అనే దాని మీద కూడా అధికారులు ఆరా తీసి ఆయన విధులు నిర్వహించిన ప్రాంతంలో ఉన్న వాళ్లకు కూడా పరిక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎవరికి కూడా కరోనా లేదని తెలుస్తుంది. అతని కుమారుడు ఉన్న రాఘవాపురం లో కూడా పరిక్షలు చేస్తున్నారు. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తెలంగాణా సరిహద్దుల్లో ఉన్న గ్రామం ఇది. దీనిని కూడా పూర్తిగా అధికారులు జల్లెడ పడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: