లోకంలో కొందరు బ్రతకలేక ఏడుస్తుంటే, మరి కొందరు బరి తెగించి ఏడుస్తున్నారు.. ఒక వైపు కరోనా లోకాన్ని ఖాళీ చేస్తుంటే కామంతో కొట్టుకుంటున్నవారు బలిసి ప్రాణాలు తీస్తున్నారు.. మూడు ముళ్ల బంధాన్ని, ఏడడుగుల పయణాన్ని, పరువును క్షణిక సుఖం కోసం పణంగా పెడుతున్నారు.. విలువలను కోల్పోతు, కుక్కలకంటే హీనంగా బ్రతుకుతున్నారు.. ఇకపోతే గుట్టుగా చేసుకోవలసిన సంసారాలను కొందరు బజారు మనుషులు నడిరోడ్డుపాలు చేస్తున్నారు.. ముఖ్యంగా ఆడపిల్లకు మానం ప్రాణంతో సమానం అంటారు.. కానీ ఈ మానాన్ని పది మందితో పంచుకునే వారు లోకంలో తయారు అవుతున్నారు.. దీని ఫలితం కుంటుంబనాశనం.. ఇప్పుడు ఇలాగే జరిగింది..

 

 

తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న భర్తను ఓ మహిళ అతి కిరాతకంగా చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది..  కాగా కాకినాడ డీఎస్పీ వి.బీమారావు కథనం ప్రకారం... జి.మామిడాడ నివాసి అయిన సొంటెన రోహిణి సూర్యనారాయణ(30) అనుమానాస్పదంగా  ఫిబ్రవరి 14న చనిపోయాడు. అయితే అతని భార్య మాత్రం తన భర్త సహజంగా మరణించాడని తెలిపింది.. అయితే సూర్యనారాయణ శరీరంపై గాయాలను గమనించిన అతని తమ్ముడు వెంకటరమణ పెదపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సూర్యనారాయణ మరణాన్ని అనుమానస్పద మృత్తిగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిజనిజాలు తెలుసుకోవడానికి ఆ దేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు..

 

 

కాగా మార్చి 18న వచ్చిన పోస్టుమార్టం నివేదికలో సూర్యనారాయణను గొంతునులిమి హత్యచేసినట్లుగా పేర్కొనబడింది.. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా, భయపడిన మృతుని భార్య దుర్గాభవానీ మంగళవారం జి.మామిడాడ వీఆర్వో వద్దకు వెళ్లి లొంగిపోయి, తనకు హరికృష్ణ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం భర్తకు తెలియడంతో తరుచూ వేధించేవాడని అందువల్ల తన అడ్దు తొలగించుకోవాలని భావించి ఫిబ్రవరి 14న మధ్యాహ్నం భోజనంలో నిద్రమాత్రలు కలిపి కాళ్లు, చేతులు చున్నీలతో కట్టి గొంతునులిమి చంపేశానని అంగీకరించింది.

 

 

ఇదంతా తన ప్రియుడు హరికృష్ణ సలహా మేరకు చేసినట్లుగా తెలిపింది.. ఇక పోలీసులకు వీఆర్వో సమాచారం అందించగా, మంగళవారం మధ్యాహ్నం కాకినాడ సీఐ మురళీకృష్ణ, పెదపూడి ఎస్సై లక్ష్మి నిందితురాలిని అరెస్టు చేశారు. దుర్గాభవానీ ప్రియుడు హరికృష్ణ పరారీలో ఉండటంతో అతనికోసం గాలిస్తున్నట్లు కాకినాడ డీఎస్సీ వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: