కొరోనా వైరస్ దెబ్బ ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతోందో చూశారా ? పై ఫొటోలోని ఓ కిరాణా షాపు చిన్నదే అయినా దాని యజమాని తీసుకున్న ముందు జాగ్రత్తలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. హైదరాబాద్ లోని స్టాలిన్ నగర్ ఉంది. అందులోని మద్దియాకుల ఓం కార్ రోడ్డులో పై షాపుంది. ప్రతిరోజు తన షాపుకి వచ్చే ఖాతాదారుల క్షేమం కోరి ముందుజాగ్రత్తగా ముగ్గుతో సర్కిల్స్ గీసేశాడు. అంటే షాపుకు వచ్చే ప్రతి ఖాతాదారుడి మధ్య సుమారు రెండడుగులు ఉండేట్లుగా ఏర్పాట్లు చేశాడు.

 

తన షాపులో నిత్యావసరాలతో పాటు ఇతర వస్తువులు కూడా అమ్ముతుంటాడు. అందుకనే ఈ షాపుకు ఖాతాదారులు కూడా ఎక్కువగానే వస్తుంటారు. అందుకనే ముందు జాగ్రత్తగా  సర్కిల్ ఏర్పాటు చేశాడు. మామూలుగా కూరగాయల కొట్లు, సరుకులమ్మే షాపుల దగ్గర జనాలు తొక్కిసలాడుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే. విజయవాడలోని పిడబ్ల్యూ గ్రౌండ్, హైదరాబాద్ లోని ఎర్రగడ్డ రైతుబజార్లో రెండు రోజుల క్రితం జనాలు కూరగాయలను, నిత్యావసరాలను లూటి చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

అలాంటి పరిస్ధితి తన షాపుకు రాకూడదని, ఖాతాదారులకు కూడా సరుకులు అందరికీ అందాలనే షాపు యజమాని ఇటువంటి ఏర్పాట్లు చేశాడు. మిగిలిన షాపుల వాళ్ళు కూడా అందరూ ఇటువంటి ముందస్తు ఏర్పాట్లే చేస్తే జనాలందరూ హ్యాపీగా ఉంటారనటంలో సందేహం లేదు. కొరోనా వైరస్ కు మందు లేదు కాబట్టి నివారణ, నియంత్రణే మందని అనుకోవాలి. ఇందులో భాగంగానే సోషల్ డిస్టెన్సింగ్ కు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయి.

 

అంటే మనిషికి మనిషికి మధ్య కనీసం ఓ మీటరు దూరం ఉండేట్లు ముందు జాగ్రత్తలు తీసుకోవటమే అందరికీ మంచిది. పై ఫొటోలోని షాపు ఈ సోషల్ డిస్టెన్సింగ్ ను కచ్చితంగా అమల్లోకి తెచ్చింది. కాబట్టి ప్రతి చోటా ఇటువంటి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే వైరస్ సోకకుండా తీసుకున్న  ముందు జాగ్రత్తలతో ఉపయోగం ఉంటుంది. లేకపోతే అంతే సంగతులు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: