కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి గ్రామాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎక్కడిక్కడ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను ఇప్పుడు గ్రామాలు అన్నీ కూడా ముందుకి వస్తున్నాయి. తమ గ్రామాల్లోకి ఎవరిని రానీయకుండా అడ్డు కంచెలు వేస్తున్నారు... రాళ్ళు పెడుతున్నారు, ముళ్ళ కంచెలు వేస్తున్నారు. ఎక్కడిక్కడ జాగ్రత్తలు పడుతున్నారు. తమ గ్రామంలోకి రావొద్దు, తాము ఎవరి గ్రామాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేస్తూ అందరూ కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణాలో ఇప్పుడు కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. 

 

దీనితో అక్కడి గ్రామాలు అన్నీ కూడా మూసి వేస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల ప్రజలు ఇదే నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం చెప్పకుండా నే అందరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వందల గ్రామాలు ఇప్పుడు ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. గ్రామ సర్పంచ్ ల మీద ఒత్తిడి చేస్తూ తమ గ్రామాలను మూసి వేస్తున్నారు. ఊర్లో సరుకులు కూడా ముందే తెచ్చుకుని పెట్టుకుని గ్రామ౦ నుంచి ఎవరూ కూడా బయటకు వెళ్ళకుండా జాగ్రత్తలు కఠినం గా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం గ్రామాల్లోకి అధికారులను కూడా రానీయడం లేదు. 

 

ప్రస్తుతం తెలంగాణాలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతుంది. దీనితో ప్రభుత్వం కూడా ఇప్పుడు కఠినం గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా వైరస్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీనితో ఆంధ్రప్రదేశ్ గ్రామాలు కూడా ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలను అప్రమత్తం చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీ లో పది వరకు కరోనా కేసులు ఉన్నాయి. దీనితో ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో ప్రభుత్వంలో అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. పోలీసు శాఖ కూడా సమర్ధవంతంగా వ్యవహరిస్తూ ఎవరిని కూడా బయటకు రానీయకుండా చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: