ఇప్పుడున్న బ్రతుకు, భయంతో కూడింది.. అయినాగాని కొందరు మాత్రం కరోనా వచ్చిందంటే.. కత్రినా కైఫ్ వచ్చిందన్నంతగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.. కానీ ఇదేమి పట్టించుకోని కరోనా మాత్రం తనఖాతాలో పెద్దమొత్తం రోగులను, మరణాలను జమ చేసుకుంటు వెళ్లుతుంది.. ఇకపోతే కరోనా వైరస్ వెలుగుచూసి తొలి 67 రోజుల్లో బాధితుల సంఖ్య లక్షకు చేరింది. అదే రెండో లక్షను తాకడానికి 11 రోజులు, మూడో లక్షను దాటడానికి కేవలం నాలుగు రోజులే పట్టగా, నాలుగో లక్షను రెండు రోజుల్లోనే చేరుకుని రికార్డ్‌లు సృష్టిస్తుంది..మొత్తంగా 197 దేశాలకు వైరస్ వ్యాపించింది.

 

 

బహూశా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ వ్యాధి కూడా ఇంత వేగంగా వ్యాపించలేదు కావచ్చూ.. ఇక ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్దితుల్లో దీన్ని ఎలా అరికట్టాలో తెలియక వైద్యశాస్త్ర బృందాలు సతమతవుతున్నాయి. ఈ క్రమంలో ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల  ప్రస్తుత సమాచారం ప్రకారం 18,895 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 4.22 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 2,400 మంది మృతి భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.

 

 

ఇక ఈ వైరస్ బారిన పడ్డవారిలో 108,879 మంది కోలుకున్నారు. మరో 2.82 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 13,095 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. మొత్తం 127,774 కేసులు క్లోజ్ అయ్యాయి. అయితే ఇటలీ పరిస్దితి మాత్రం చాలా దయనీ స్దితిలోకి జారుకుంది.. కేవలం ఒక మంగళవారం 743 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 6,820కు చేరుకుంది. కొత్తగా మరో 5,249 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కేసులు 69,176 దాటింది. ఇంతటి దారుణాలకు కారణం కరోనా వచ్చిన సమయంలో ఇటలీ ప్రభుత్వం, ప్రజలు చేసిన నిర్లక్ష్యం ఫలితం.. ఇంతటి విపత్తుకు దారితీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో భారతదేశ ప్రజల నిర్లక్ష్యం వల్ల ఇండియా మరో ఇటలీగా మారే అవకాశం ఉండటంతో, ప్రభుత్వాలు, అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: