ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు ఏమైందని తెలుగుదేశంపార్టీ నేతలు అనుకుంటున్నారు. ప్రతిరోజు నేతలతో టెలికాన్ఫరెన్సు లేకపోతే సమీక్షా సమావేశాలు పెట్టాల్సిందే. నేతలెవరూ అందుబాటులో లేకపోతే చివరకు మీడియా సమావేశం అయినా సరే పెట్టనది చంద్రబాబు రోజు గడవదు. నేతలైనా మీడియా సమావేశం అయినా తక్కువలో తక్కువ ఓ రెండు గంటల అందరి బుర్రలు తినేయాల్సిందే. చెప్పిన విషయాలనే చెప్పి, మళ్ళీ అవే విషయాలను రిపీట్ చేయటంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా.

 

ఇంతకీ విషయం ఏమిటంటే పై ఫొటోను చూశారు కదా. దాదాపు 30 మంది కూర్చునేందు అనువుగా ఉన్న పెద్ద హాలులో ఒక్కడే కూర్చున్నాడు. మరి ఏం చేస్తున్నాడో తెలీదు కానీ చాలా సీరియస్ గా మొబైల్ తో బిజీగా ఉన్నట్లే కనిపిస్తోంది. కరోనా వైరస్ గురించి నేతలతో మాట్లాడుతున్నాడో లేకపోతే వైరస్ ప్రభావం గురించిన సమాచారం చదువుతున్నారో మాత్రం తెలీలేదు. ఏదేమైనా ఇపుడు ఫొటో విషయం ఏమిటంటే అంత పెద్ద హాలులో అన్నీ కుర్చీలు ఖాళీగా ఉంటే తానొక్కడే ఉండే ఫొటోను ఎందుకు పబ్లిసిటి ఇచ్చుకుంటున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఈ ఫొటోను ఎవరో ఎక్కడి నుండో తీసింది కాదు. స్వయంగా చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోనే ఇది. అంటే చంద్రబాబు సమీక్షలంటే నేతలందరూ భయంతో పారిపోతున్నారా ? లేకపోతే కరోనా వైరస్ దెబ్బకు  ఎవరు రామని చెప్పేశారా ? ఏదేమైనా  ఇటువంటి ఫొటోలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇమేజిని దెబ్బ తీసేవే గానీ ఇమేజిని ఏ విధంగాను పెంచేవి మాత్రం కావన్నది వాస్తవం.

 

దేశరాజకీయాల్లోనే ఒకపుడు చక్రంతిప్పానని చెప్పుకునే చంద్రబాబు చుట్టూ ఖాళీ కుర్చీలు కనిపించటం ఆయన స్ధాయిని దిగజార్చేయటం మాత్రం ఖాయం. అంతపెద్ద హాలులో ఒక్కడే కూర్చుని ఉన్న ఫొటోను చూసి నెటిజన్లు చంద్రబాబును ఓ ఆటాడేసుకుంటున్నారు. మరి ఇటువంటి ఫొటోను చంద్రబాబు ఎందుకు అప్ లోడ్ చేసుకున్నాడో ఆయనకే తెలియాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: