రోజురోజుకూ విజృంభిస్తోన్న కరోనా వైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా 18 వేలమందికి పైగా మృతి చెందారు. చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి ఇప్పటివరకు 174 దేశాలకుపైగా విస్తరించగా 4.15 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. కరోనా నియంత్రణ ప్రభుత్వo కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినగాని కొంతమంది అధికారులు మాత్రం ఏమాత్రం పట్టి పర్వా లేనట్లు వ్యవహరిస్తున్నారు రోడ్ల పై అందరికి కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇస్తూ కనిపిస్తున్నారు. తప్ప తమ పరిధిలో యధేచ్చగా కొనసాగుతున్న కంపెనీల జోలీకి మాత్రం పోవడం లేదు ప్రభుత్వం అనుమతులు ఉన్నాయి అని కంపెనీ యజమానులు తమ సిబ్బంది అడిగిన వారికి చెబుతుంటే వారికి అధికారులే పరిశ్రమల యజమానులకు వత్తాసు పలుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏ స్థాయిలో పాటిస్తున్నారన్నది కొంత మందిని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ వైర‌స్ పై సోష‌ల్ మీడియాలో ర‌క ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అయితే వాట‌న్నిటినీ న‌మ్ముతూ దేశ ప్ర‌జ‌లు మ‌రింత భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. ఈనేప‌ధ్యంలోనే మ‌నం ప్ర‌తి రోజు చ‌దివే న్యూస్ పేప‌ర్లు కూడా ఇంటికి వేయించుకోవ‌డం మంచిది కాదంటూ కొన్ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటున్నారు.  అమెరికాలోని ప్రిన్స్‌టన్  యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌తో నిర్వహించిన అధ్యయనం ప్రకారం కోవిడ్‌ వేర్వేరు ఉపరితలాలపై వేర్వేరు కాలం మనుగడ సాగించింది. గత వారం న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో చేసిన స‌ర్వే ప్ర‌కారం వాళ్ళు చెప్పేదేమిటంటే...  కార్డ్‌బోర్డు, రాగి వంటి వాటిపై వైరస్‌ తక్కువ కాలం బతుకుతుంద‌ని. కార్డ్‌బోర్డులో సూక్ష్మస్థాయి కన్నాలు ఉండటం ఇందుకు ఓ కారణం. ఈ వైరస్‌లు నున్నటి, కన్నాలులేని ఉపరితలాలపై ఎక్కువకాలం జీవిస్తాయని కూడా పరిశోధన స్పష్టం చేసింది. గాలి సోకినప్పుడు ఈ వైరస్‌ తీవ్రత తగ్గుతూ పోతుందని, ప్రతి 66 నిమిషాలకు వైరస్‌ సామర్థ్యం సగం తగ్గుతుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 

 

ఇక ఈ వార్తా పత్రికలను ముట్టుకుంటే కోవిడ్‌ వ్యాపిస్తుందనడంఇలాంటి విష‌యాల‌ను అస్స‌లు న‌మ్మొదంటున్నారు. కోవిడ్‌ కేసులు ఉన్న ఏ ప్రాంతంలోనైనా వార్తా పత్రికలను తీసుకోవడం, చదవడం వల్ల ఎలాంటి ముప్పు లేద‌ని. కోవిడ్‌ బారిన పడ్డ వ్యక్తి కాగితాల ద్వారా వైరస్‌ను వ్యాప్తి చేయలేరని.. రకరకాల పరిస్థితులు, వాతావరణాల నుంచి వచ్చినా ఇబ్బందేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రశ్నోత్తరాల విష‌యాన్ని ఎంతో స్ప‌ష్టంగా తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: