అగ్ర రాజ్యం అమెరికా క‌రోనా దెబ్బ‌తో వ‌ణికి పోతోంది. ముందు నుంచి కరోనాతో  ముప్పు ఉంద‌ని వార్త‌లు వ‌చ్చినా కూడా అమెరికా ప్ర‌జ‌లు దీనిని లెక్క చేయ‌లేదు. ఇప్పుడు ప‌రిస్థితి కంట్రోల్ త‌ప్ప‌డంతో ఎవ్వ‌రూ ఏం చేయ‌లేని ప‌రిస్థితి. పెరుగుతోన్న మ‌ర‌ణాల‌తో ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌లు నెల‌కొంటున్నాయి. మ‌రో వైపు సిబ్బంది కూడా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేసేందుకు, వైద్యం అందించేందుకు భ‌య ప‌డుతున్నారు. ఇక ఇప్ప‌టికే అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55 వేల‌కు చేరుకుంది. ప్ర‌పంచంలోనే చైనా, ఇట‌లీ త‌ర్వాత మూడో స్థానంలో ఉంది.

 

ఇక ఇప్ప‌టికే అక్క‌డ కోవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య 55 వేల‌కు చేరుకుంది. మ‌రో రెండు మూడు రోజుల్లో అమెరికా ప్ర‌పంచంలోనే అగ్ర స్తానానికి చేరుకునే ప్ర‌మాదాలు ఉన్నాయి. ప్ర‌భుత్వం కూడా ఏం చేయ‌లేక చేతులు ఎత్తేసే ప‌రిస్థితులు కూడా క‌నిపిస్తున్నాయి. ఒక్క న్యూయార్క్‌లోనే 25 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే అక్క‌డ 780 మంది మృతి చెందారు. అమెరికాలో కి ఈ వైర‌స్ ఎంట్రీ ఇచ్చిన కేవ‌లం మూడు వారాల్లోనే మ‌హ‌మ్మారి దేశం అంత‌టా వ్యాప్తి చెందింది.

 

ఇప్ప‌టికే అక్క‌డ 40 నుంచి 80 శాతం మంది క‌రోనాతో సంబంధం క‌లిగి ఉన్నారు. ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌తో అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భారీ న‌ష్టం చేకూరింది. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో అక్క‌డ ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌జ‌లు కూడా స‌మ‌ష్టిగా విఫ‌లం అయ్యారు. అమెరికా మొత్తంలో స‌గం కేసులు న్యూయార్క్‌లోనే ఉండ‌డంతో అక్క‌డ ప‌రిస్థితి తీవ్ర‌త అర్థ‌మ‌వుతోంది. మ‌రో వైపు తెలుగు వారు ఎక్కువుగా ఉండే న్యూ జెర్సీ త‌దిత‌ర ప్రాంతాల్లో సైతం క‌రోనా కోర‌లు చాస్తూ దూసుకు వెళుతోంది.

 

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువుల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త మ‌వుతోంది. అక్క‌డ ప్ర‌జ‌లు ఇక్క‌డ‌కు వ‌చ్చేందుకు వీలు కాక‌పోవండంతో అక్క‌డ ఉన్న త‌మ వారి ఆరోగ్య ప‌రిస్థితి కూడా ఆరాలు తీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: