ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. సమావేశంలో మంత్రులందరూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించారు. ఈ భేటీలో దేశమంతటా లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధానంగా చర్చించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన కీలకమైన చర్యల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. లాక్ డౌన్ ప్రకటించిన తరువాత తొలిసారి మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 
 
మీటరు నుంచి మీటరున్నర దూరంలో మంత్రులు కుర్చుని ప్రజలు కరోనా విషయంలో సామాజిక దూరం పాటించాలనేలా మంచి సందేశం ఇచ్చారు. కేంద్ర మంత్రి వర్గం లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది. మంత్రివర్గంలో నిత్యావసర వస్తువులను ప్రజలకు చేరవేయడం గురించి చర్చకు వచ్చినట్లు సమాచారం. 
 
కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు, దేశంలో ప్రస్తుత పరిస్థితి, లాక్ డౌన్ గురించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు, అధికారుల మధ్య సమన్వయం కోసం నోడల్ అధికారిని నియమించుకోవాలని, ప్రజలు ఏవైనా ఇబ్బందులు పడుతుంటే వాటిని తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కొనసాగించాలని... వాటిని లాక్ చేయవద్దని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం ఇప్పటికే అనేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. కరోనా మహమ్మారిని దేశంలో నియంత్రించేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాన్ని చూసైనా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తారేమో చూడాలి. మరోవైపు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: