కరోనా వైరస్.. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ కు ప్రజలు ఎంత భయపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికి 18 వేలమందికిపైగా మృతి చెందారు. 4లక్షలమందికిపైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.. అందులో లక్షమందికి పైగా ఈ కరోనా వైరస్ బారి నుండి బయటపడ్డారు. 

 

ఇంకా భారత్ లో కూడా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందడంతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మొత్తం లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ను అంతం చెయ్యడానికి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తున్నారు. ఆలా చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో ఎంతోమంది వ్యక్తులు కరోనా వైరస్ అంతం అవ్వాలి అంటే ఇలా చెయ్యాలి.. ఆలా చెయ్యాలి అని చెప్తూనే ఉన్నారు. 

 

ఒకరు ఏమో.. ఐదు ఇళ్లలో నీళ్లు తీసుకొని వేప చెట్టుకు పోయాలి అని ఒకరు చెప్తున్నారు.. మరొకరు ఆవు పేడతో కరోనా పోతుంది అని అంటారు.. మరొకరు మిరియాల రసం మంచిది అని అంటారు.. ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒకరకమైన ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇంకా ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా జరుగుతుంది. అది ఏంటి అంటే పెరుగు తింటే వైరస్ లు అంతం అవుతాయి అని ప్రచారం జరుగుతుంది. 

 

ఈ నేపథ్యంలోనే పెరుగు తో వైరస్ ఎంత అంతం అనేదాంట్లో ఎంత నిజం అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. పెరుగులో ప్రొ బయోటిక్స్‌ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. దీనివల్ల శరీరానికి వైరస్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతేకాదు ఈ ఎండాకాలంలో ఈ పెరుగు చల్లదనానికి ఎంతో మంచి చేస్తుంది. కాబట్టి ఈ పెరుగును తినండి ఆరోగ్యాన్ని పెంచుకోండి.. రోగనిరోధక శక్తిని పెంచుకోండి.    

మరింత సమాచారం తెలుసుకోండి: