ప్రపంచాన్ని పట్టి భయంకరంగా పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు మనదేశంలో తీవ్ర రూపం దాల్చుతుంది.  దేశంలో ఇప్పటివరకు మొత్తం 562 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ప్రస్తుతం 512 మంది బాధితులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.  కాకపోతే ఈ కరోనా వైరస్ బాధితులంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం.  ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఈ కరోనా సోకడం వల్ల దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.

 

 

కరోనా ని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.  ఇప్పటికే లాక్ డౌన్ చేసిన విషయం తెలిసింతే. మొన్న ఆదివారం జనతా కర్ఫ్యూ కూడా పాటించారు. ఇలా సాద్యమైనంత వరకు తమను తాము రక్షించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇండియా చేస్తున్న కృషి, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయమని కోవ్‌-ఇండ్‌-19 భారత మేధావులు, డేటా సైంటిస్టుల సముదాయం కితాబిచ్చింది.  భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

ఈ చర్య మంచిదేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. అయితే, లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు దేశ విపత్తు నుంచి కాపాడుకోవాలంటే ఈ సమయం మరింత పొగిడించినా ఆశ్చర్యం లేదని అన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశం సరైన విధంగా సన్నద్ధం కాలేదని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు. అందుకే భారీ మూల్యం చెల్లించాల్సివస్తోందని, భవిష్యత్తులో మరింత కఠిన పరిస్థితులు చూడాల్సి వస్తుందని తెలిపారు.  కరోనాని కట్టడి చేయడం అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు.. అది మన చేతిలోనే ఉందని.. ఇంటిపట్టున ఉండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: