ఈ క‌రోనా వైర‌స్ వ్యాధి గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న నేప‌ధ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఇంటికే ప‌రిమిత మ‌వుతున్నారు. ఎక్క‌డా బ‌య‌ట‌కు వ‌స్తే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌టం లేదు. వండుకోవడం, తిన‌డం కుదిరితే ఇంట్లో సిస్ట‌మ్‌ముందో, టీవీల ముందో కూర్చోవ‌డం. ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ‌కుండా కూర్చుని ప‌ని కానిచ్చేస్తున్నాము. దీంతో మ‌న‌లో చాలా మంది ఉన్న వెయిట్ కంటే కూడా అధిక వెయిట్ పెరిగే ప్ర‌మాదం ఎంతైనా ఉంది. ఇక వెయిట్ పెరిగితే అన్నీ ప్రాబ్ల‌మ్సే. ఆఖ‌రికి న‌డ‌వ‌డం కూడా ఇబ్బందిక‌రంగా మారుతుంది. కొంచం ఎక్కువ‌గా న‌డిచినా ఆయాసం వ‌స్తుంది. ఇక ఇదిలా ఉంటే మ‌న శ‌రీరానికి కొంతైనా వ్యాయామం అనేది చాలా అవ‌స‌రం. కాబ‌ట్టి ఇంట్లోనే కూర్చుని బ‌రును ఎలా త‌గ్గించుకోవాలో కొన్ని తెలుసుకుందాం...

 

ఇక  భారత్‌లో అధిక బరువు ఉన్నవారు చాలా మందే ఉన్నారు. బ్రిటన్ ప్రభుత్వం అక్కడి వారికి రోజుకు ఒకసారి రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ చెయ్యడానికి అనుమతిచ్చింది. మన ఇండియాలో అలాంటి పర్మిషన్లు లేవు. ఓన్లీ ఇంట్లోనే కాబట్టి... ఇంట్లోనే ఉంటూ సింపుల్ ఎక్సర్‌సైజులు చెయ్యమంటున్నారు. మెట్లు ఎక్కి దిగడం, డాబాపై రౌండుగా నడవడం, ఇంట్లో వస్తువుల్ని అటూ ఇటూ కదపడం, పాత వస్తువులు ఉంటే... వాటిని తీసి... ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, బట్టలు వాషింగ్ మెషిన్‌లో కాకుండా... చేతులతో ఉతుక్కోవడం, వంట చెయ్యడం ఇలాంటి ఏవో ఒక పనులు చేస్తూనే ఉండాలని సూచిస్తున్నారు.  క‌ద‌ల‌కుండా అలా కూర్చోవ‌డం వ‌ల్ల ఈ ప‌దిరోజుల్లో అధిక బ‌రువు పెర‌గ‌డం ప‌క్క‌న పెడితే మ‌నిషి బ‌ద్ధ‌కం కూడా వ‌చ్చేస్తుంది. రోజూ మ‌నం చేసే ప‌ని కూడా చెయ్య‌బుద్ధి కాదు. అందులోనూ బ‌య‌ట ఎండ‌లు కూడా అదురుతున్నాయి. ఈ ఎండ‌లో ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు వెళ్ళ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. ఇక వీలైనంత‌సేపు ప‌డుకోవాల‌నిపిస్త‌ది కాని అది ఎంత మాత్రం మంచి ప‌ద్ధ‌తి కాదు. 

 

 లాక్ డౌన్ సమయంలో టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల ముందు కూర్చొని సినిమాల వంటివి చూడటం కంటే... ఇంట్లో ఎప్పటి నుంచో పూర్తి చెయ్యాలనుకుంటున్నకొన్ని పనులను ఇప్పుడు చేసేసుకోవాలని సూచిస్తున్నారు. వీలైతే... ఇల్లంతా ఓసారి క్లీన్ చేసుకోవడం లేదా సున్నం, పెయింట్ వంటివి వేసుకోవడం చాలా మంచిది ఇంటికి ఇల్లు సుభ్ర‌ప‌డుద్ది మ‌న‌కి కాస్త ఎక్స్‌ర్‌సైజ్‌లాగా ఉంటుంది. అలాగే చాలా మంది కొన్ని మ‌సాలా దినుసులు ఎప్ప‌టిక‌ప్పుడు మిక్సీ చేసి పెట్టుకుంటుంటారు. దాని బ‌దులు కొంచం ఓపిక చేసుకుని రోట్లో దంచి పెట్టుకుంటే రుచికి రుచి చేతుల‌కి కూడా మంచి ఎక్స్‌ర్‌సైజ్‌లాగా ఉంటుంది.   ఇళ్లలో రోజువారీ పనులను వాయిదా వెయ్యకుండా చేస్తూ ఉంటే కూడా చాలా కేలరీలు కరుగుతాయంటున్నారు. 

 

 తినే ఆహారం విషయంలోనూ తక్కువ కేలరీలు ఉండేవే తింటే చాలా మంచిది. ఆకుకూరలు, కూరగాయల ఆహారం ఎక్కువగా తినాలని చెబుతున్నారు. ఎక్కువ నీరు తాగాలనీ, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, స్వీట్లు, చాకొలెట్లు వీలైనంతవరూ తగ్గించేయాలని చెబుతున్నారు. అలాగే కుదిరినంత వ‌ర‌కు ఎక్కువ లిక్విడ్స్ మీదే గ‌డిపేస్తే బెట‌ర్ అదేమిటంటే స‌గ్గుబియ్యంజావ‌, బార్లీనీళ్ళు, స‌బ్జానీళ్ళు, నిమ్మ‌కాయ‌ర‌సం ఇవ‌న్నీ తాగుతూ ఉంటే వంటికి చాలా మంచిది. మ‌న‌కు ఆక‌లికూడా వెయ్య‌దు. అలాగే మ‌న‌లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం యూరిన్ రూపంలో పోతుంద‌ని వైధ్యులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: