అరే.. కాస్త అయినా తెలివి ఉండద్దా? కాస్త అయినా జాగ్రత్తలు పాటించద్ధా? ఎన్ని చెప్తున్నారు? కాస్త దగ్గు.. జలుబు.. జ్వరం ఉంటేనే ఆస్పత్రికి వచ్చేయండి.. మేము జాగ్రత్తలు తీసుకుంటాం.. మీ ప్రాణాలు కాపాడుతాం అని చెప్తున్నారు.. అయినప్పటికీ ఎవరికీ వినిపించడం లేదు.. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు ఎటువంటి మందు లేదు.. దానికి నివారణ లేదు.. మలేరియాకు వేసే మందు క్లోరోక్విన్ పాస్పేట్ వాడాలని ఇప్పటికే ప్రపంచ దేశాలు నిర్ణయిస్తున్నాయి. అయితే ఆ మలేరియా మందు కరోనాను తగ్గిస్తుంది అని అందరూ అంటున్నారు. ఈ విషయన్నీ అమెరికా అధ్యక్షుడు ట్రాంప్ కూడా ప్రకటించాడు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ మాటలు అన్ని నమ్మి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న దంపతులు ఆ మలేరియా మందు వాడి మృతి చెందారు. సొంత వైద్యం చేసుకోండి చివరికి ప్రాణాలను విడిచారు. ఈ ఘటన అమెరికాలోని అరిజొనలోంలో చోటుచేసుకుంది. మృతి చెందిన దంపతుల వయసు 60 ఏళ్ళు దాటింది. వారు కరోనా వైరస్ బారిన పడటంతో ఆస్పత్రిలో చీరకొండ ఇంట్లోనే సొంత వైద్యం చేసుకొని నిర్ణయించుకుని ఇంట్లోనే వైద్యం చేసుకున్నారు. 

 

వారికీ తెలిసిన మందులు.. సోషల్ మీడియాలో చెప్పే మందులు.. చేపల తొట్టెలను శుభ్రం చేసే ద్రావణం వంటివి తాగారు. కరోనా నివారణకు క్లోరోక్విన్ పాస్పేట్ మందు పని చేస్తుందని కొందరు చెప్పడంతో ఆ దంపతులు ఆ మందు తీసుకున్నారు. అయితే ఆ మందులు వికటించడంతో భర్త మృతి చెందాడు.. ఆమె తీవ్ర అస్స్వస్దతకు గురై ఆస్పత్రిలో చేరి కోన ఊపిరితో ఉన్న ఆమె కూడా మృతి చెందారు.. ఇలా కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నప్పటికీ వారు ఆసుపత్రికి రాకుండా సొంత వైద్యంతో ఆస్పత్రిలో చేరకుండా మృతి చెందినట్టు వైద్యులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: