ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా భూతం పట్టి పీడిస్తుంది. ఎక్కడ చూసినా ఈ కరోనా మహమ్మారి గురించే ప్రస్తావన వస్తుంది. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు దేశాలన్నీ చుట్టేస్తుంది.  ఇప్పటి వరకు మనిషి ఎన్నో రకాల విజయాలు సాధించాడు.. కానీ ఈ కరోనా వైరస్ కి మందు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు.  కరోనాని జయించడం మనచేతిలో పనే అంటున్నారు.  ఈ నేపథ్యంలో ఈ వైరస్ ఎక్కువగా ప్రభలకుండా కట్టడి చేయడమే మన ధ్యేయం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. కరోనా మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

 

ఈ లాక్ డౌన్ 21 రోజుల పాటు కొనసాగుతోందని తెలిపారు. లాక్ డౌన్ ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు.   అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పరిధిలోకి వస్తాయని, ప్రతి నగరం, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి వీధి లాక్ డౌన్ తప్పదని తెలిపారు.తాజా సమాచారం మేరకు ఒకసారి భారతదేశ ప్రభుత్వం కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాష్ బోర్డు పరిశీలించినట్లయితే మన దేశంలో ఇప్పటివరకూ 15 లక్షల 24 వేల 266 మందిని స్క్రీనింగ్ చేశారు. ఇప్పటివరకు 470 కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 39 మంది కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.

 

కరోనా వైరస్ వల్ల ఇప్పటికి భారతదేశంలో అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు నమోదైన మరణాలు 9.  కరోనా వైరస్ స్టేజ్ 3 లోకి ప్రవేశిస్తే నేరుగా ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెంది ఒకేసారి మహమ్మారి లాగా వందల వేల మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది.  24 గంటలు పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధుల క్షేమం కోసం ప్రార్థిద్దామని సూచించారు. దేశంలో ప్రతి పౌరుడు తమ బాధ్యతగా లాక్ డౌన్ పాటించాలని.. కరోనాని కట్టడి చేయాలని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: