ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తూ వస్తుంది..కరోనా ఎలా వ్యాపిస్తుంది అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుంది. అయితే, కరోనా అనేది మనుషులను తాకడం వళ్ళ, లేదా వారి నుంచి వచ్చిన తుమ్ము వల్ల ఇలాంటి వాటి ఈ మహమ్మారి మనిషి నుంచి మనిషికి సోకుంది. అందుకే ఈ మహమ్మారిని అరికట్టాలని అందరు నిపుణులు సూచిస్తున్నారు. 

 

 


ఈ కరొనను పూర్తిగా నియంత్రించడానికి  జనతా కర్ఫ్యూని విధించారు. అందుకే ప్రజల్లో ఈ కరోనా భయాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం జనతా కర్ఫ్యూని చేపట్టింది. ఇందులో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇక ఈ కరోనా కర్ఫ్యులో భాగంగా మర్చి 31 వరకు కొనసాగుతుందని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని తీసుకున్నారు.

 

 


అందుకే గత రెండు రోజుల నుంచి అనేక ప్రజలు స్వచ్చందంగా బంద్ ను కొనసాగిస్తున్నారు. ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా ప్రభావం లేదని లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రజలు ఏప్రిల్ 14 వరకు ఇంటి నుంచి బయటకు రావవద్దని సూచింది. అలాగే ప్రజలు ఒకవేళ వస్తే కఠిన చర్యలు తప్పవని సూచించింది. అయినా కూడా ప్రజలు ఏ మాత్రం లెక్క చేయకుండా బయటే తిరుగుతున్నారు. 

 

ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని సినీ తారలు కూడా వారికి తెలిసిన విషయాలను ప్రజలతో పంచుకుంటూ వస్తున్నారు. అందుకే ప్రజలను కరోనా మహమ్మారి నుంచి బయట పడటానికి ప్రజలకు పూర్తిగా సహకరిస్తూ వస్తున్నారు. ఈమేరకు ప్రముఖ సింగర్లు మ్యూజిక్ డైరెక్టర్లు ప్రజలకు పాటల ద్వారా కరోనా గురించి జాగ్రత్తలను తెలుపుతున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఓ పాటను పాడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: