ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుంది.  కరోనా మహమ్మారి రోజు రోజుకీ ప్రబలి పోతుంది.. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి తమ ఐక్యతను చాటుకును పరిస్థితి వచ్చిందని.. దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరాన్ని పాటించాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రజలను కోరారు.  నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిత్యావసరాలన్నీ అందుబాటులోనే ఉంటాయని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. కొంత మంది లేని పోని పుకార్లు లేపుతూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. 

 

ఇలాంటి సమయంలోనే మనోనిర్భరం ఉండాలని.. కరోనాని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికీ ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం కరోనా ప్రపంచం మొత్తం వ్యాపించిందని.. ఎంతో టెక్నాలజీ ఉన్న దేశాలు సైతం ఇప్పుడు కరోనా కష్టాలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల అనేక దేశాల్లో మరణాలు సంభవించాయని అన్నారు. దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలంగా క్రమశిక్షణ, పరిశుభ్రత పాటించాలని అప్పుడు మనం కరోనాని అరికట్టగలమని అంటున్నారు. 

 

కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆయా సంస్థలు, కంపెనీలను కోరారు. పాలు, నిత్యావసర సరుకుల దుకాణాలు నిర్ణీత సమయంపాటు తెరిచే ఉంటాయని అన్నారు. రెండు రూపాయలకే కిలో గోధుమలు, మూడు రూపాయలకే కిలో బియ్యం అందిస్తామని జవదేకర్ తెలిపారు. కరోనా బూచి చూపిస్తూ అధిక ధరలకు అమ్మేవారి గురించి దగ్గరలోని అధికారులకు చూపించాలని.. ఫిర్యాదు చేయాలని అన్నారు.  ప్రస్తుతం ఒకరికి ఒకరు సహాయం చేసుకునే ఆత్మీయ పరిస్థితి ఉండాలని.. ఇలాంటి సమయాల్లో క్యాష్ చేసుకోవాలని అనుకోవొద్దని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: