ప్రపంచమంతా కరోనా వ్యాపిస్తోంది. వేల మంది ప్ర‌జ‌లు క‌రోనా దెబ్బ‌తో పిట్ట‌ల్లా రాలి పోతున్నారు. ఇట‌లీలో అయితే మ‌నుషుల జ‌నాలు గుట్ట‌లు గుట్ట‌లుగా ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే చైనా నుంచి యూర‌ప్‌తో పాటు అమెరికా దేశాల‌కు సైతం వ్యాపించిన ఈ వైర‌స్ ఎప్పుడు ఎవ‌రిని ఎలా బ‌లి తీసుకుంటుందో ?  ఊహ‌కే అంద‌డం లేదు. ఈ క్ర‌మంలోనే యూర‌ప్‌లోని జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌... స్పెయిన్ దేశాల‌కు సైతం ఈ వైర‌స్ పాకేసింది. ఇక జ‌ర్మ‌నీ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా త‌మ పౌరుల కోసం ఏకంగా రు. 1984 కోట్లు పెట్టి మాస్క్‌లు త‌యారు చేయించింది. ఈ మాస్క్‌లు జర్మనీలో దిగుమతి చేస్తామనగా ఎవరో కొట్టేశారు. దీంతో ఆ దేశం ఇప్పుడు లబోదిబోమంటోంది.

 

ఇప్ప‌టికే క‌రోనా ఇట‌లీలో విల‌య తాండ‌వం చేస్తోంది. ఇట‌లీలో మ‌ర‌ణ మృందంగం దెబ్బ‌తో రోజుకు వంద‌ల్లో జ‌నాలు చ‌నిపోతున్నారు. దీంతో ప‌క్క‌నే ఉన్న జ‌ర్మనీ ఎలెర్ట్ అయ్యింది. ఇప్ప‌టికే జ‌ర్మ‌నీలో 32వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 150మంది మరణించారు. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో జ‌ర్మ‌నీ అలెర్ట్ అయ్యి 241 మిలియన్ యూరోలు ( మ‌న భార‌త క‌రెన్సీలో రు. 1984 కోట్లు ) ఖ‌ర్చు పెట్టి ఆఫ్రికా దేశాల నుంచి మాస్క్‌లు ఆర్డ‌ర్ ఇచ్చింది. ఇవి రెడీ అవ్వ‌గా... వీటిని తీసుకు వ‌చ్చేందుకు జ‌ర్మ‌నీ విమానం అక్క‌డ‌కు వెళ్లింది. 

 

ఈ మాస్క్‌ల‌ను తీసుకు వ‌స్తుండ‌గా... కెన్యా విమానాశ్రయంలో  జర్మనీకి చెందిన 6 మిలియన్ల ఫేస్ మాస్క్ లు గల్లంతయ్యాయి.  ఈ మేరకు జర్మనీ కస్టమ్స్ అధికారులు తమ మాస్కులు కెన్యా దేశంలో ఎవరో దొంగలించారని వాపోయారు. ఈ మాస్క్‌లు అత్యంత నాణ్య‌మైన‌వి అట‌. ఇవి వైర‌స్ క‌ణాల‌ను ఏకంగా 90 శాతం వ‌ర‌క‌కు ఫిల్ల‌ర్ చేసేంత నాణ్య‌మైన‌వి అట‌. ఈ మాస్క్‌లు జ‌ర్మ‌నీలో దిగితే చాలా వ‌ర‌కు క‌రోనాకు బ్రేకులు ప‌డ‌తాయ‌ని ఆ దేశ‌స్తులు భావించారు. మ‌రి కెన్యాలు ఏ ముసుగు దొంగ‌లు వీటిని దొంగిలించారో ?  ఇప్ప‌టికే విచార‌ణ జ‌రుగుతోంది. అయితే అటు జ‌ర్మ‌నీలో మాత్రం త‌మ మాస్క్‌లు గ‌ల్లంతు కావ‌డంతో వాళ్లంతా ల‌బోదిబో మంటోన్న ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: