కరోనా.. ఇప్పుడు ఈ మహమ్మారి బారిన పడిన దేశాల్లో అమెరికా కూడా ముందు వరుసలో ఉంది. అక్కడ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అమెరికా మూడో స్థానంలో ఉంది. ఇప్పటికి ఈ దేశంలో 50 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులోనూ ఇవి చాలా వేగంగా పెరుగుతున్నాయి. దాదాపు 800 మంది అమెరికాలో ఇప్పటికే కరోనా తో చనిపోయారు.

 

 

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాపించకుండా అన్ని దేశాలూ లాక్ డౌన్ చేస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బంది అయినా ప్రజలను కాపాడుకోవడానికి ఇంత కంటే వేరే మార్గం ఆ దేశాలకు కనిపించడం లేదు. కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఇంత జరుగుతున్నా షట్ డౌన్ గురించి మాట్లాడటం లేదు. అంతే కాదు.. దేశం మొత్తాన్ని షట్‌డౌన్‌ చేయాలన్న వైద్యుల సూచనను పాటించనని డొనాల్డ్‌ ట్రంప్‌ తేల్చి చెప్పారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం అలాచేస్తే ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందంటున్నారు.

 

 

దేశాన్ని వైద్యులు చెప్పారని షట్ డౌన్ చేయను... ఈ విషయాన్ని వైద్యులకే వదిలేస్తే దేశం మొత్తం షట్‌డౌన్‌ చేయమంటారు. అలాగైతే ప్రపంచమంతా షట్‌ డౌన్‌ చేయాలి. అంటే దాదాపు 150 దేశాలు షట్‌డౌన్‌ అవ్వాలి అంటూ మండిపడ్డారు ట్రంప్. అంతే కాదు.. షట్‌డౌన్‌ చేస్తే బాగానే ఉంటుంది. అయితే దానిని రెండేళ్లు కొనసాగిద్దామా! అది కుదరదని మీకూ తెలుసు. ఏ దేశంలోనూ ఆ పని చేయరంటూ ఎదురుదాడి చేశారు.

 

 

కరోనా కోసం అమెరికాను షట్ డౌన్ చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అప్పుడు చాలా నష్టం జరుగుతుందని ట్రంప్ అంటున్నారు. అంతే కాదు.. చాలా ప్రాంతాల్లో కొవిడ్‌-19 లేదు. కొన్ని చోట్ల నామమాత్రంగా ఉంది. అలాంటప్పుడు దేశమంతా ఎందుకు లాక్‌డౌన్‌ చేయాలని ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ ఇలా తన మూర్ఖత్వంతో అమెరికాను సర్వనాశనం చేస్తారేమో అని అమెరికన్లు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: