కరోనా వైరస్ ఈ పేరు చెప్తేనే వెన్నులో వణుకొస్తోంది. దీని మూలంగా ఎన్నడూ ఎదుర్కొని పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటున్నాము. అయితే.. ఈ విషయం పై సెలెబ్రిటీలు కూడా నియమ నిబంధనలను పాటిస్తున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందున టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని దీనిపై స్పందించాడు. ఈ వైరస్ ను అదుపు చేయాలంటే మనకి మనం గృహ నిర్బంధం చేసుకోవటం తప్ప వేరే దారి లేదన్నాడు నాని. ఈ కరోనా వైరస్ ను అదుపు చేయటానికి మెడిసిన్, వాక్సిన్ లేదు కాబట్టి ఎవరికి వారు దూరంగా ఉంటే స్ప్రెడ్ కాకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఈ సమస్య మన అందరిదని కావున మనం అందరం కలిసి ఈ వైరస్ ను కట్టడి చేయాలని ఆయన సూచించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుందని, దీనికి ఎలాంటి మందు లేదని అన్నాడు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలన్న ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా ఉండాలన్న సామజిక దూరం పాటించడం చాలా ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు.

 

ఇప్పటి వరకు స్ప్రెడ్ అయిన వైరస్ ఇప్పటి నుంచి స్ప్రెడ్ చేయకుండా ఉంటే ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ భారిన పడి వారి పరిస్థితి సీరియస్ గా ఉన్నవారు, చికిత్స అవసరమైన వారికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇళ్లకు పరిమితం కావాలి అని కోరారు. ఈ వ్యాధి నుంచి త్వరగానే మనం బయట పడతామని ఆయన అన్నారు.

 

కావున ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభత్వం సూచించిన సూచనల మేరకు అందరం నడుచుకుంటే చాలా మంది అమాయకుల ప్రాణాలను కాపాడిన వారం అవుతామని ఆయన కోరారు. కానీ కొందరు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకోవటం లేదని అందరు బాధ్యతగా వ్యవహరిస్తే చాల బాగుంటుందని అన్నారు. ఒకవేళ ఇప్పుడే ఈ వైరస్ ను అరికట్టలేకపోతే చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటామని గుర్తు చేశారు. ఇప్పుడు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. అసలు ఇప్పటికే లేట్ అయిందని ఇప్పటికయినా ఒక పరిష్కార మార్గం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు.      

మరింత సమాచారం తెలుసుకోండి: