కవురు శ్రీనివాస్...ఈ పేరు ప్రస్తుతం పశ్చిమ గోదావారి రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు. రాష్ట్ర రాజకీయాలని శాసించే పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో కవురు శ్రీను అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వీరవాసరం ఎంపీటీసీ గా ఎన్నికై స్థానికంగానే కాకుండా, మెల్ల మెల్లగా చుట్టుపక్కల ప్రాంతాలపై పట్టు పెంచుకున్నారు. తన పర బేధం లేకుండా శ్రీను అన్న అంటే నేను ఉన్నాను అంటూ ప్రతీ ఒక్క గడపకి వెళ్లి పలకరించే కవురు కి నలుగురుకి సాయం చేయాలనే తపన అక్కడి ప్రజలలో విపరీతమైన ఆదరణ తెచ్చిపెట్టింది...సమాజ సేవలో నిమగ్నమై, రాజకీయాల ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకి సేవ చేయాలని భావించిన కవురు వైసీపీ పార్టీలో చేరి మండలంలో పార్టీని బలోపేతం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు...దాంతో  

IHG

2019 ఎన్నికలకి  ముందు జగన్ మోహన్ రెడ్డి ఆచంట నియోజకవర్గ భాద్యతలు అప్పగించారు. దాంతో స్థానిక ప్రజల పూర్తి మద్దతుతో అహర్నిశలు కష్టపడి పనిచేశారు. అయితే అనూహ్యమైన పరిణామాల నేపధ్యంలో జగన్ కోరిక మేరకు ఆచంట ఎమ్మేలే స్థానాన్ని వదులుకున్నారు. కానీ అందరి నేతల్లా పార్టీ పై, అధినేత పై అసంతృప్తి వెళ్ళగక్కలేదు. పార్టీపై గౌరవం అంతకు మించి అధినేత జగన్ పై ఉన్న అభిమానం కవురుని  పార్టీ విధేయుడిగా జగన్ కి అత్యంత నమ్మకస్తుడిగా నిలిపాయి..ఫలితంగా..

IHG

జగన్ ఆశీస్సులతో పశ్చిమగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. పదవి వచ్చింది కదానని ఎక్కడా బేషజాలకి పోలేదు, డీసీసీబీ ని ప్రక్షాళన చేయాలని భావించారు. పనిచేయని అధికారులని పరుగులు పెట్టించారు. ఏళ్ళ తరబడి రాకుండా మూలుగుతున్న మొండి బకాయిలని రాబట్టాలని లేకపోతే   చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు. ఉద్యోగులు, అధికారుల నెలవారీ రివ్యూ మీటింగ్ లకి సైతం  కవురు ప్రత్యేకించి వెళ్ళడం ఉద్యోగులని అందరిని ఆశ్చర్యపరిచేలా చేయడమే కాదు వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపింది...ప్రభుత్వ పధకాలని అర్హులకి అందించే విషయాలో కానీ , పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్ళడంలో ఎక్కడా రాజీపడరనే పేరు కూడా ఉంది.

IHG

ఒక పక్క పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గా , మరో పక్క డీసీసీబీ చైర్మెన్ గా భాద్యతలు సమర్ధవంతగా నిర్వరిస్తున్న కవురు ని చూసి సీనియర్ నేతలే ముక్కున  వేలేసుకుంటున్నారు. పశ్చిమ నుంచీ ఎవరు జగన్ దగ్గరకి వెళ్ళినా కవురు పేరు జగన్ ప్రస్తావించడంతో సదరు నేతలు  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. పశ్చిమ పర్యటనకి జగన్ వచ్చినా శ్రీను ఎక్కడా అని అడగటం కరువుపై జగన్ కి ఉన్న నమ్మకానికి నిదర్శనమని అంటున్నారు. అంతేకాదు

IHG

పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేకమైన దుష్టి కేంద్రీకరించిన జగన్ మోహన్ రెడ్డిజిల్లా జెడ్పీ ఛైర్మెన్ పదవికి కవురు పేరుని ప్రస్తావించడంతో ఇప్పుడు ఈ యువ నేత జిల్లాలో హాట్ టాపిక్ అయ్యాడు. కవురు విషయంలో జగన్ ఎంతో సంతృప్తితో ఉన్నారని, జిల్లా పరిస్థితులపై తెప్పించుకునే నివేదికలలో ఈ యువ నేతకి మంచి మార్కులే పడుతున్నాయని, అందుకే  జిల్లా  జెడ్పీ ఛైర్మెన్ పదవికి కవురు పేరుని జగన్  ప్రతిపాదించారని  తెలుస్తోంది. యువ నేతలని జగన్ ప్రోశ్చహించడమే కాదు ప్రజలకి సేవ చేయడానికి  రాజకీయ పదోన్నతులు కల్పిస్తున్నడాని చెప్పడానికి కవురు శ్రీనే  ఓ ఉదాహరణ...

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: