దేశంలోకి రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే భరత్ లో 569 కేసులు నమోదైయ్యాయి. ప్రభుత్వం ఎంత కఠిన చర్యలు తీసుకున్న ఈ వ్యాధి బారిన పడ్డే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధిని వేగంగా విజృభించటంతో దేశంలో లాక్ డౌన్ విధించారు. ఆలా అయినా కొంత వరకు ఈ వ్యాధి అరికట్టవచ్చు అని ప్రభుత్వం అభిప్రాయం పడింది. 

 

ప్రాణాంతకమైన వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ మూడు వారాలపాటు ప్రజలు ఎవరు తమ ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలన్ని మంగళవారం సాయత్రం మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రక్రటించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 14వేల మంది ఈ వైరస్ భారీన పడి మరణించారు. అందుకే 21 రోజుల లాక్ డౌన్ సమయం ముఖ్యమైంది అని అన్నారు. ఈ  వైరస్ నియత్రించటానికి సామాజిక దూరం అతి పెద్ద మార్గమని ఆయన తెలిపారు.

 

తాజాగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ స్కీం కేంద్రం ప్రకటించింది. లాక్‌ డౌన్‌ తో కరోనాను కచ్చితంగా అరికట్టవచ్చని కేంద్రమంత్రి జవదేకర్‌ చెప్పారు.

 

ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆయన తెలిపారు. నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. 

 

కరోనా వల్ల అనేక దేశాల్లో మరణాలు సంభవించాయన్నారు. భారత్‌లో కరోనా కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజలంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. వారికీ పాలు, నిత్యావసర సరుకుల దుకాణాలు, నిర్ణీత సమయంలో తెరిచే ఉంటాయన్నారు. కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని వారు ఆదేశించారు. రూ. 2కే కిలో గోధుమలు అందిస్తామని జవదేకర్‌ ఈ సందర్బంగా తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: